తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన అజిత్ సింగ్ ఇక లేరు

తెలంగాణఉద్యమానికి ఎపుడూ అండగా నిలిచిన  రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి చౌదరి అజిత్ సింగ్ మృతి చెందారు.   కోవిడ్ తో గురుగావ్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన  గురువారం ఉదయం  కన్నుమూశారు. ఆయన వయసుల 82 సంవత్సరాలు. ఆయన ఉత్తర భారతదేశంలో రైతు ఉద్యమాలకు బాట వేసిన మహానేత చౌదురి చరణ్ సింగ్ కుమారుడు. ఆయన తెలంగాణలో పర్యటించారు. పలు సభల్లో ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం శైశవ దశలో ఉన్నపుడు డిల్లీలో అండగా నిలిచిన నేతల్లో  చౌదరి అజిత్ సింగ్  ముందున్నారు.

మొన్న ఏప్రిల్ 20న ఆయనకు కరోనా సోకింది. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే  అ ఆయనను గురువావ్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. చివరి వరకు ఆయన కోవిడ్ పోరాడుతూ ఈ ఉదయం చనిపోయారని ఆయన కుమారుడు జయంత్ చౌదరి ట్వీట్ చేశారు.

అజిత్ సింగ్ ఎనిమిదిసార్లు పార్లమెంటుకు ఎంపికయ్యారు. ఇందులో ఒక టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేంద్రంలో ఆయన నాలుగు సార్లు మంత్రిగా ఉన్నారు.

రాజకీయాల్లోకి రాకముందు ఆయన అమెరికాలో కంప్యూటర్ నిపుణిడి గా పనిచేశారు. తండ్రి చరణ్ సింగ్ మరణంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.

అజిత్ సింగ్ ఖరగ్ పూర్ ఐఐటి నుంచి బిటెక్ చేశారు.తర్వాత ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి షికాగో లేని ఇలినాయస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. 1986లో మొదటి సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎపుడూ తండ్రి చరణ్ సింగ్ ప్రాతినిధ్యం వహించిన పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని బాగపట్ నుంచే లోక్సభ కు  ఏడు సార్లు ఎన్నికయ్యారు.

అన్ని ప్రభుత్వాలతో ఆయన మంత్రిగా ఉన్నారు. మొదట విపిసింగ్ ప్రభుత్వంలో తర్వాత, పివి నర్సింహారావు ప్రభుత్వంలో, ఆపైన ప్రధని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో చివర సోనియా నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *