పంచాయతీ ఎన్నికల్లో గెల్చాం, తొందర్లో యుపి అసెంబ్లీ కూడా మాదే: అఖిలేష్ యాదవ్
ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ గెలుపొందిందని, 2022 ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ ప్రకటించారు.
రాష్ట్రంలో జరిగిన 1500 జిల్లా పరిషత్ వార్డులలో 800 మంది పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు గెలిచారని చెబుతూ ‘70 శాతం ప్రజలు యుపిలో గ్రామల్లో నివసిస్తున్నారు, బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద వారు తీర్పు చెప్పారు. ఈ తీర్పు బిజెపికి అనుకూలంగా వచ్చింది. ఇక అసెంబ్లీ కూడా మాదే,’ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
ఎన్నికల్లో బాగా వెనకబడిన బిజెపి , అఖిలేష్ ప్రకటనను ఖండించింది. జిల్లా పరిషత్ వార్డు ఎన్నికల్లో వెనకబడినా ఎక్కువ జిల్లా పరిషత్ లను తాము గెలుచుకుంటామని బిజెపి ప్రకటించింది.
యుపిలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగెలుపొందడటంతో వాళ్ల మద్దతు సంపాదించేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తున్నది. ఇపుడు బిజెపికి ఇదే ఆశ. మొత్తానికి ఈ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి సొంతంగా వెనకబడటం శుభసూచన కాదు.
ఇంకా పూర్తి ఫలితాలు రాలేదు. వారణాసి, అయోధ్య, గోరఖ్ పూర్, లక్నో జిల్లాలో బిజెపి వెనకబడింది. ఇవన్నీ చాలా ముఖ్యమయిన జిల్లాలు. వారణాసి ప్రధానిమోదీలో క్‌సభ నియోజక వర్గం. అయోధ్య బిజెపి రాకీయాలకు గుండెకాయ. గోరఖ్ పూర్ ముఖ్యమంత్రి యోగి సొంత జిల్లా, లక్నో రాజధాని జిల్లా.