చాలా ప్రమాదకరమని వార్తలకెక్కిన కోవిడ్ -19 ఆంధ్ర కరోనా వైరస్ రకం (N440k) రాష్ట్రంలో ప్రవేశించినట్లు కనిపించడంతో ఒడిషా ప్రభుత్వం, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులను మూసేసింది. ఒదిశా రాయగడ జిల్లాలో తెలుగు రాష్ట్రాలకు ఉన్న 13 చెక్ పోస్టులను జిల్లా అధికారులు మూసేశారు. కేవలం అత్యవసర్ సరుకును రవాణా చేస్తున్నవాహనాలను, అనుమతి పత్రాలంటే , రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ ల నుంచి ఒదిశాలోకి ప్రవేశించాలంటే RT-PCR చేయించుకున్నాకే అనుమతిస్తారు. లేదంటే వ్యాక్సిన్ వేయించుకుని 14 రోజుల తప్పనిసరి క్వారంటౌన్ విధిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సరోజ్ కుమార్ మిశ్రా చెక్ పోస్టులను పరిశీలించి , కోవిడ్ ప్రోటోకోల్ తప్పనిసరిగా అమలయ్యేలాచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో తొలుత కనిపించిన (N440k) వైరస్ వ్యాప్తి తగ్గిపోతున్నది. ఈ వైరస్ స్థానంలోకి బ్రిటన్ B.1.617 వేగంగా చేరకుంటున్నది హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యులార్ బయాలజీ శాస్త్రవేత్తలు చెప్పారు.