భారత్ మూడో వేవ్ కోవిడ్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పిన 24 గంటలలో లో కరోనా కేసులు కొత్త రికార్డు సృష్టించాయి. గత 24గంటలలో కోవిడ్ తో మర 3,980 మంది చనిపోయారు. దీనితో భారత్ లో మరణాల సంఖ్య 2.30 లక్షలకు చేరింది. మరణాల రేటు 1.09 శాతం ఉంది. కొత్త కేసులు 4,12,262 నమోదయ్యాయి. భారత లో యాక్టివ్ కేసులు 35,66,398 కి చేరింది. మొత్తం కరోనాకేసులలో ఇది 16.87 శాతం.
గురువారం నాడు రోజు వారి కేసులు 4 లక్షల కు చేరడానికి ముందు రెండు వారాల పాటు రోజూ 3 లక్షలకు మించి కొత్త కేసులు కనిపించాయంటేదేశంలో రెండోవేవ్ కోవిడ్ ఎంత బలంగా ఉందో వూహించవచ్చు.
ఇంతవరకు 16,25,13,339 మందికి మాత్రమే వ్యాక్సిన్ అందింది. ఇందులో రెండు డోస్ అందినవారి సంఖ్య బాగా తక్కువ. బుధవారంనాడు 19,55,733 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నేటి బులెటీన్ లో పేర్కొంది.