బాలివుడ్ నటి,మోడల్ దీక్షా సింగ్ ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆమెకు కేవలం 2000 వోట్లు వచ్చాయి. బాష్కా లో 26 వ వార్డు నుంచి ఆమె పోటీ చేశారు.
గతంలో ఈ సీటు నుంచి ఆమె తండ్రి ప్రాతినిధ్యం వహించారు.అయితే, ఈ సీటును మహిళలకు కేటాయించడంతో పోటీ చేసేందుకు ఆమె ముందుకు వచ్చారు. అయితే బిజెపి మద్దతుతో ఆమె మీద పోటీ చేసిన నగీనా సింగ్ కు 5000 వోట్ల ఆధిక్యత వచ్చింది. దీక్ష మాత్రం మరీ అధ్వాన్నంగా ఐదో స్థానంలో కి పడిపోయింది.
ఉత్తర ప్రదేశ్ జాన్ పూర్ జిల్లా, బస్కా బ్లాక్ లోని చిత్తోరి గ్రామంలో పుట్టారు. ఇక్కడే మూడో తరగతి దాకా చదువుకున్నారు. ఆపైన మకాం ముంబైకి మార్చారు. 2015లో పెమీనా మిస్ ఇండియా పోటీ రన్నరప్ గా నిలిచారు. అపుడపుడు ఈ వూరికి వస్తూ అక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదని ఆవేదన చెందుతూ వచ్చారు. అక్కడి మహిళలు పరిస్థితి కూడా బాగా లేదనేవారు. ఈ సమస్యల మీదే ఆమె ఎన్నికల్లో పోటీచేశారు. గతంలో ఆమె కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. మోడెల్ గా పనిచేశారు. అయితే, ఆమెకు రాజకీయాలు అచ్చివచ్చినట్లు లేవు.పంచాయతీ ఎన్నికల్లో నే ఓడిపోయారు.