ఆంధ్రప్రదేశ్ కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత 24 గంటలలో కొత్తగా మరో 20,034 కొత్త కేసులు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 1,15,784 శాంపిల్స్ పరీక్షిస్తే 17.3% పాజిటివిటీ (20,034 ) అని నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించి శ్రీకాకుళం నుంచి అత్యధికంగా 2398యకేసులు నమోదయ్యాయి. తర్వాత చిత్తూరు జిల్లా నుంచి 2318 కేసులు, అనంతపురం నుంచి 2,168 కేసులు , విశాఖపట్నం నుంచి 1976 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ తో మరణించినవారి సంఖ్య 8,289 కిచేరింది.
రాష్ట్రంలో మొత్తం 82 మంది మృతి చెందారు.అయితే, వైరస్ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న కరోనా కేసులు కోసం రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు సంఘల్ చెప్పారు. వీటి కోసం రూ.346 కోట్లు కేటాయించారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు 21,850 ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చేశామని ఆయన చెప్పారు.