తెలంగాణలో హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించాలి: దాసోజు శ్రవణ్

‘’రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థని యుద్దప్రాతిపదికన పునరుద్ధరించాలి’’ అని డిమాండ్ చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.

ఈ మేరకు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణకి పది నిర్మాణాత్మక సూచనలు చేశారు శ్రవణ్.

కరోనా లాంటి విపత్కక పరిస్థితిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించడం ద్వారా సీఎం కేసీఆర్ తన క్షుద్ర రాజకీయాలకే పాధన్యత ఇస్తున్నారు తప్పితే ప్రజల ప్రాణలు పట్ల ఎంతమాత్రమూ భాద్యత వ్యవహరించడం తేట తెల్లమైయిందని విమర్శించిన దాసోజు కరోనా వైద్యం సంజీవని లా పని చేస్తున్న రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ వంటి మందులు కావాలంటే కేటీఆర్ సిఫార్సు కావాల్సివస్తుందని ఆరోపించారు.

ఈటెల ఆరోగ్య శాఖ మంత్రిగా కనీసం ప్రజలకు అందుబాటులో వుండేవారు. కానీ కరోనా బాదితుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖని తీసుకొని ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటాని వెనకడుగు వేయడం లేదని, ప్రగతి భవన్ కోట గోడ దాటని ముఖ్యమంత్రి ప్రజలకు కల్పించే భరోసాఏంటని ప్రశ్నించారు దాసోజు.

‘ఆసుపత్రులలో బెడ్స్ లేక, సకాలంలో ఆక్సిజన్ లభించకపోవడం వలన అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. దాదాపు 40-50% శాతం వైద్య సిబ్బంది ఖాళీలు వున్నాయి. రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ వంటి ప్రాణాలను రక్షించే మందులు విపరీతమైన ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లెన్స్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ అమలు కావడం లేదు. వ్యాక్సినేషన్ కూడా పూర్తిగా జగరడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా బాదితుల భయాన్ని ఆసరాగా చేసుకొని నిలువుగా దోచుకుంటున్నాయి’’ అని లేఖలో ప్రస్తావించారు శ్రవణ్.

‘ ఇంటర్నేషనల్ ఫార్మా హాబ్ గా పిలవబతున్న హైదరాబాద్ నేడు మందుల కొరతతో ఇబ్బంది పడుతుంది. కోవాక్సిన్ హైదరాబాద్‌లో తయారవుతుంది కానీ తెలంగాణ ప్రజలకు టీకాలు వేసే కార్యచరణ లేకుండాపోయింది. ఇవన్నీ తెలంగాణలో పేలవమైన పాలనను ప్రతిబింబిస్తాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో అసలు ఆరోగ్య శాఖలో మంత్రి లేకుండా చేయడం దారుణమైన పాలనకు పరాకాష్ట’’ అని విమర్శించారు దాసోజు.

‘’ఎప్పుడైనా సరే ప్రజల ప్రజల తర్వాతే రాజకీయాలు. ప్రజల క్షేమమే ప్రధమ కర్తవ్యం. కానీ నేడు చిల్లర రాజకీయాలు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దురదృష్టకరం. కరోనా విలయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చిల్లర రాజకీయాలకే ప్రాధన్యత ఇస్తూ ప్రజల రక్షణని గాలికి వదిలేయడం బాధారం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు.

‘’కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినపుడు సెకెండ్ వేవ్ కూడా వుంటుందని శాస్త్రవేత్తలు, సర్వేలు స్పష్టంగా చెప్పాయి. కరోనా విలయాన్ని ఎదురుకోవడానికి ప్రభుత్వాలు సిద్దంగా వుండాలని హెచ్చరించాయి. కాంగ్రెస్ పార్టీ గా మేము కూడా అనేక సార్లు హెచ్చరించాం. హెల్త్ సెక్టార్ పై ద్రుష్టి పెట్టాలని, ఆక్సిజన్ బెడ్లు అందుకోబాటులోకి తీసుకురావాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని, విపత్తుని ఎదురుకోవడానికి ఖాళీగా వున్న వైద్య సిబ్బంది ఖాళీలని వెంటనే భర్తీ చేయాలనీ మొత్తుకున్నాం. కానీ ప్రభుత్వం వినలేదు. కరోనా ఇంకా లేదని ఊహల్లో తేలారు. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి రూ. 1000కోట్లతో సచివాలయాలు కట్టుకున్నారు. అప్పుడు కానీ ప్రజా ఆరోగ్యంపై సోయి వుండి విలాసవంతమైన ఆఫీసులకి బదులు హాస్పిటల్ లో కట్టివుంటే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఈ స్థాయికి దిగజారకపోయేదని’’ పేర్కొన్నారు దాసోజు.

‘’ప్రస్తుత N440K డబుల్ మ్యూటాంట్ కోవిడ్ వేరియంట్ పేరెంట్ స్ట్రెయిన్ కంటే 10 రెట్లు ఎక్కువ అంటువ్యాధి. రెండు తెలుగు రాష్ట్రంలో వ్యాపిస్తుంది. కోవిడ్ 3 , 4 వేవ్స్ కూడా వచ్చే ఛాన్స్ వుందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ఈ నేపధ్యంలో సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణను అందించడం, మన ప్రజల జీవితాలను రక్షించడం ప్రభుత్వ భాద్యతే కాదు మానవతా విధి. అందువల్ల అన్ని రాజకీయాలను పక్కన పెట్టి, మనమందరం సమిష్టిగా పనిచేసి తెలంగాణలో బలమైన ఆరోగ్య, పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలను కల్పిస్తేనే, కోవిడ్ 3,4 వేవ్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాము’’ అని అన్నారు దాసోజు.

 రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు

1. హెల్త్ కేర్ ప్రొఫెషనల్‌ను ఆరోగ్య మంత్రిగా నియమించడం
రెండో దశ కరోనా తీవ్రంగా సమయంలో ఆరోగ్య శాఖమంత్రిని తొలగించడం వెనుక ఉన్న కారణాలు ప్రస్తుతానికి విడిచిపెట్టి.. కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా అర్హత కలిగిన వైద్యుడిని , ప్రజారోగ్యంపై అనుభవజ్ఞుడైన నిపుణుడుని నియమించడం అవసరం.

మాజీ ఏపీ సీఎం ఎన్టీఆర్, యుఎస్ఎ నుండి భారతదేశానికి ఆహ్వానించి, నిమ్స్ ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కాకర్లా సుబ్బారావు సేవలని గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. కొత్త ఆరోగ్య మంత్రిగా ఇలాంటి అర్హత కలిగిన వైద్యుడు వుండాలని సలహా.

2. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించండి. రాష్ట్ర , జిల్లా స్థాయిలో 24/7 కోవిడ్ వార్ రూమ్‌ను ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, వైద్యులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, ఎన్జిఓలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (ఆర్‌డబ్ల్యుఎ) నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయండి. ఆరోగ్య నిపుణులతో వేలాది టీకాల కేంద్రాలతో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ పరీక్షా కేంద్రాల పూర్తి నియంత్రణను తీసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ తగ్గించాలి. దోపిడీ ని అరికట్టడానికి అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ రోగనిర్ధారణ కేంద్రాల వద్ద ఢిల్లీ సాయుధ దళాలను మోహరించండి.
తగినంత పరీక్ష కియోస్క్ లు / ఉచిత పరీక్షా కేంద్రాలు , వేలల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేయండి ప్రతి పౌరుడికి వారి వయస్సుతో సంబంధం లేకుండా ఉచిత పరీక్ష , టీకాలు ఉచితంగా అందేలా చూసుకోవాలి.
60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు వారి ఇళ్లలో టీకాలు వేయించాలి. కోవిడ్ కారణంగా అయిన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఎక్స్-గ్రేటియాను విడుదల చేయండి.

3. కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి
ప్రభుత్వ ఆసుపత్రులలో తగినంత సంఖ్యలో పడకలు లేవ. ప్రైవేట్ ఆస్పత్రులు దోచుకుంటున్నాయి పేదలు నాణ్యమైన చికిత్సని కోల్పోతున్నారు. అందువల్ల, ఇటీవల అసెంబ్లీ సమావేశంలో వాగ్దానం చేసినట్లుగా, ప్రభుత్వం వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసినట్లుగా ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్సను చేర్చాలి

4 . రెమిడిసివిర, తోసిలిజుమాబ్ వంటి ప్రాణాలను రక్షించే మందులు ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుడురుచుకొని రాష్ట్ర నిధులతో తనగింత ఉత్పత్తి చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల సులభంగా అందే పంపిణీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఫార్మ బ్లాక్ మార్కెట్ ని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి.

5. వైద్య సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలి
వైద్యులు, నర్సులు , పారా మెడికల్ సిబ్బందితో సహా ఆరోగ్య శాఖలో బిస్వాల్ కమిషన్ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కోవిడ్ హాస్పిటల్లో పనిచేయడానికి పిజి విద్యార్థులతో సహా అన్ని ఫైనల్ ఇయర్ మెడిసిన్, నర్సింగ్ విద్యార్థులను నియమించాలి.
వివిధ విదేశీ విశ్వవిద్యాలయాలలో మెడిషన్ పూర్తి చేసి IMA అనుమతి కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు సడలింపు ఇవ్వండి. రాష్ట్రంలో వైద్యుల కొరతని అధికమించడానికి ఇది తోడ్పడుతుంది
పరీక్షల కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ విద్యార్థులందరికీ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించాలి. రోగులకు సేవ చేయడానికి అనుమతి ఇవ్వాలి. వారికి ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వాలి. కరోనా సమయంలో వైద్యులు, నర్సులు , వైద్య సిబ్బంది సేవలని ఉత్తేజపరుస్తూ ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించండి.
ప్రతి గ్రామంలో పిఎమ్‌పి , ఆర్‌ఎమ్‌పి వైద్యులను హెల్త్ వాలంటీర్లుగా నియమించండి. వా రికి తగినంతగా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వండి. ఈ కష్టకాలంలో వారి సేవలు సపోర్ట్ మెకానిజంగా పని చేస్తాయి. అలాగే జింక్, విటమిన్ సి, విటమిన్ డి, బి-కాంప్లెక్స్ మొదలైన విటమిన్ టాబ్లెట్స్ పేదలకు ఉచితంగా పంపిణీ చేయండి.

6. . ఆక్సిజన్ ఉత్పత్తి , ఐసియు/ వెంటిలేటర్ పడకల తయారీని ప్రభుత్వ యాజమాన్యంలో ఏర్పాటు చేయడం చేయాలి. వీటి ఉత్పత్తిలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి.

7. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో 1000+ పడకలు, ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో 30+ పడకల ఆసుపత్రి , ప్రతి అసెంబ్లీ విభాగంలో 100+ పడకల ఆసుపత్రులను నిర్మించండి.

ప్రతి జిల్లాలో నిమ్స్ వంటి హాస్పిటల్ నిర్మించడంతో పాటు ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో 1000+ పడకలు, ప్రతి అసెంబ్లీ విభాగంలో 100+ పడకలు, ప్రతి మండల ప్రధాన కార్యాలయంలో 30+ పడకల ఆసుపత్రి నిర్మిస్తామని టీఆర్ఎస్ 2014 లో తన మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఈ వాగ్దానం చేసిన ముసాయిదా కమిటీలో నేను వున్నానని గుర్తు చేస్తున్నాను.
గత 7 సంవత్సరాలలో పలు ప్రాధాన్యత లేని ప్రాజెక్టుల కోసం సుమారు 17 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎన్నికల వాగ్దానాలు ఏవీ నెరవేరలేదు. రాష్ట్రంలో కేవలం 45000+ హాస్పిటల్ పడకలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 14000+ (30%) పడకలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి మిగిలిన 31000 (70%) పడకలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. తెలంగాణలో ప్రతి 10000 మందికి, కేవలం 1.3 జనరల్ బెడ్స్, 1.5 ఆక్సిజన్ పడకలు , 0.6 ఐసియు పడకలు , ప్రభుత్వ రంగంలో మొత్తం 3.5 పడకలు ఉన్నాయి. ప్రైవేటు రంగంలో 3.6 సాధారణ పడకలు, 2.5 ఆక్సిజన్ పడకలు మరియు 1.7 ఐసియు పడకలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో మొత్తం 7.8 పడకలు.
ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులలో పడకల తీవ్రమైన కొరత ఉంది. ఆసుపత్రి పడకలను కనీసం 2 లక్షలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వాగ్దానం చేసినట్లు వెంటనే ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రారంభించాలి. సిఎం కేర్ ఫండ్స్ ద్వారా లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ద్వారా కూడా వీటిని చేపట్టవచ్చు. ఆర్థిక పరిమితులు ఉంటే, ఆసుపత్రులను సిఎస్ఆర్ విధానాల ప్రకారం నిర్మించడానికి కార్పొరేట్ కంపెనీల సహకారాన్ని కూడా ప్రభుత్వం పొందవచ్చు.

8. ‘’నిర్మాణంలో ఉన్న కొత్త సచివాలయాన్ని కోవిడ్ రోగులకు చికిత్స అందించేలా అత్యాధునిక ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చండి. టిమ్స్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, నీలౌఫర్ హాస్పిటల్ ఇతర జిల్లా స్థాయి ఆసుపత్రులతో సహా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు తగిన నిధులు కేటాయించండి.

9. కరోనావైరస్ మానవజాతి శత్రువుగా మారిపోయింది. ఎంతో మంది కుటుంబ సభ్యులని కోల్పోయి తీవ్ర విషాదంలో వున్నారు. కోవిడ్ ని ఎదుర్కోవటానికి తగిన సహాయక వ్యవస్థ, ఆరోగ్య మౌలిక సదుపాయాలు , సామాజిక భద్రతా చర్యలని చేపట్టకపొతే, ప్రజలు మరిన్ని తీవ్ర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల, మహమ్మారి కోవిడ్ పోరాడటంలో తెలంగాణను భారతదేశంలో ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా మార్చడానికి పైన పేర్కొన్న సూచనలను దయతో అమలు చేయాలని, ఇలాంటి మహమ్మారి భవిష్యత్తులో వచ్చినా ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్రం సిద్దంగా వుందని చాటి చెప్పాలే ప్రపంచ స్థాయి ఆరోగ్య సదుపాయాలను కలిగి ఉన్న ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా ఎదగాలని’’
10. పారదర్శకత, జవాబుదారీతనం ఉండటానికి ప్రభుత్వం సిఎం కేర్ ఫండ్ల పూర్తి వివరాలను ప్రకటించాలి’’ అని కోరారు దాసోజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *