ఆంధ్రప్రదేశ్ 104 కాల్ సెంటర్ కి రోజుకి 10 వేలకు పైగా ప్రజల నుంచి వచ్చే కాల్స్ ను అటెండ్ అవుతున్నారు. ప్రతి షిఫ్ట్ కి అరవై మంది పని చేస్తున్నారని స్పెషలాఫీసర్ 104 కాల్ సెంటర్ అహ్మద్ బాబు తెలిపారు.
3500 మంది డాక్టర్లు 104 ద్వారా వచ్చే కాల్స్ కి టెలి కన్సల్టేషన్ ఇస్తున్నారు. అందులో మూడు వందల మంది స్పెషలిస్టులకు కూడా ఉన్నారు. డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ వారు పేషెంట్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం బెడ్ ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జిల్లా కాల్ సెంటర్ వారు ఎప్పటికప్పుడు పేషెంట్స్ తో మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.
అంతేకాకుండా 104 కాల్ సెంటర్ కు రిజిస్టర్ చేసిన 3500 మంది డాక్టర్లు ప్రతినిత్యం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారితో మాట్లాడుతూ వారికి ఇచ్చిన యాప్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ ఎస్ఎంఎస్ ద్వారా ప్రిస్క్రిప్షన్ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడమైనది.
ఇలా ప్రతి రోజు హోం ఐసోలేషన్ లో ఉన్న 20 వేలకు పైగా పేషెంట్స్ ని పలకరించటం వారికి కావలసిన వైద్య సదుపాయం విషయంలో తగు జాగ్రత్తలు చెప్తూ సూచనలు ఇస్తారు.