అఖండ విజయం దిశలో మమత, మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడోసారి  ప్రభుత్వం ఏర్పాటుచేయ బోతున్నారు. ఆమె కు  210 సీట్ల దాకా రాబోతున్నాయి. ఈ సారి  200 సీట్లు దాటుతామని ప్రకటించిన బిజెపి రెండంకెలే దాటకపోవచ్చు.

పార్టీ నుంచి ఫిరాయింపులు, బిజెపి పెత్తనం, గవర్నర్ తో పేచీ, ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి ఆరోపణల మధ్య తృణమూల్ కాంగ్రెస్ సాధిస్తున్న ఈ విజయం అసాధారణమయింది.

బిజెపిని గెలిపించేందుకు, మమతా బెనర్జి మానసిక స్థయిర్యం దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. మరొక వైపు నుంచి కేంద్ర హోం మంత్రి  అమిత్ షా దాడి ప్రారంభించారు.

ఇలాంటి వాతావరణంలో  మమతా బెనర్జీ గెలుపే కష్టమనుకున్నారు. అనుకున్నట్లే ఒక దశలో ఆమె నందిగ్రామ్ వెనకబడ్డారు. మధ్యాహ్నం నాలుగున్నర కల్లా అంతా తారుమారయింది. నందిగ్రామ్  లో మమతా బెనర్జీ గెలుపొందేదిశలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలప్పటికి ఆమెకు 3200 మెజారిటీ వచ్చింది.చివరకు 1200 వోట్ల మెజారిటీతో ఆమె గెలిచినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.  తృణమూల్ పార్టీకి  200 లకు మంచి స్థానాలు రాబోతున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *