కేసీఆర్ కి కుట్రలు తప్ప కరోనా చావుల సోయి లేదు: దాసోజు ధ్వజం

’ సీఎం కేసీఆర్ కేవలం తన చిల్లర రాజకీయాల కోసమే పని చేస్తున్నారు. తనకు అడ్డం వచ్చిన మంత్రుల్ని ఎలా తొలగించాలనే కుట్రలు తప్పా కరోనా బాదితుల కష్టాల పట్ల కేసీఆర్ కు సోయి లేదు’’ అని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.

‘కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తుంది’’ అని దాసోజు వెల్లడించారు.

మే డే సందర్భంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తా లో సోమాజిగూడ కాంగ్రెస్ అధ్యక్షులు నరికేల నరేష్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.


*మాస్కులు కూడా ఇవ్వలేని స్థితి కేసీఆర్ సర్కార్
*కరోనా బాధితుల పాలిట శాపంగా మారిన కేసీఆర్చిల్లర రాజకీయాల్ని *మానుకొని కరోనా నియంత్రణపై కెసిఆర్ దృష్టి పెట్టాలి
*డాక్టర్లు, నర్సు పోస్టుల ఖాళీని వెంటనే భర్తీ చేయాలి


ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అద్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో కోవిడ్ సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆక్సిజన్ లేని వారికి ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజక్షన్స్, బెడ్లు అందుబాటులోకి తీసుకురావడం, బాదితులకు సకాలంలో అంబులెన్స్ లు ఏర్పాటు చేయడం.

ఇలా అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నేతలు ,, ప్రజలకు తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో, రాష్ట్ర కార్యాలయాల్లో కోవిడ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి , టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి కోవిడ్ బాధితుల్ని ఆదుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు.

‘’టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మాస్కులు కూడా అందించలేని దుస్థితికి వెళ్లిపోయింది. ఆక్సిజన్ దొరకదు, బెడ్లు లేవు, రెమిడిసివిర్ ఇంజక్షన్స్ అందడం లేదు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకు తిరిగినట్లు కేసీఆర్ ప్రగతి భవన్ అనే కోటలో కూర్చుని కరోనా బాదితుల పాలిట శాపంగా మారారు’’ అని విమర్శించారు దాసోజు.

‘’యుద్దప్రాతిపాదిక హాస్పిటల్ లో వున్న డాక్టర్, నర్స్ ఖాళీలని భర్తీ చేయాలి. ఆక్సిజన్ కొరతని తీర్చాలి. ఆక్సిజన్ పంపిణీ పెంచాలి. బెడ్ల సంఖ్య పెంచాలి. కరోనా ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి’’ అని డిమాండ్ చేసిన దాసోజు దయచేసి చిల్లర రాజకీయాలని మానుకొని కరోనా కష్టాల్లో వున్న ప్రజలని కాపాడాలని కోరారు.

ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ .. ‘’కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలనే కరోనా మరణాలు తీవ్ర స్థాయిలో సంభవిస్తున్నాయని, కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలే’’ అని ఆరోపించారు.

కరోనాని నియంత్రిండం కంటే ఎన్నికల్లో ఎలా గెలావాలన్న అంశంపైనే ప్రభుత్వాలు ద్రుష్టి పెట్టాయని, పీఎం కేర్, సీఎం కేర్ పేరిట వచ్చిన డబ్బు ఎక్కడికి పొయిందని ప్రశ్నించారు పొన్నం. హై కోర్టు , సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీవాట్లు పెట్టినప్పటికీ దున్నపోతు మీద వాన కురిసినట్లు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు పొన్నం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *