2021 ఏప్రిల్ ఎంత క్రూరమైందో చూడండి…

ఈ  2021 ఏప్రిల్ నెల చరిత్రలో ఒక విషాద మాసంగా మిగిలిపోతున్నది. కొన్ని గంటల కిందట ముగిసిన  ఈ నెల  భారతదేశం మీద ఒక క్రూరమయిన, వికారమయిన చిత్రం గీచి, భయపెట్టి వెళ్లిపోయింది.

2021 ఏప్రిల్ లో   భారతదేశమంతా మృత్యువు అడ్డూ అదుపు లేకుండా విహరించింది. కనిపించినవాళ్లనంతా పొట్టన పెట్టుకుంది.

ఒక్క మాటలో చెబితే  2021 ఏప్రిల్ నెల ఒక నిలువెత్తు కన్నీటి బొట్టు.

ఎన్ని ఇళ్లలో ఎంత శోకం మిగిలించిందో, ఎందరిని అనాధలను చేసిందో లేక్కేలేదు.  కరోనా వైరస్ 2021 ఏప్రిల్ నెలగా అవతారమెత్తిందా అనిపిస్తుంది. అందుకే ఈ నెలలో భారత ఆరోగ్య శాఖ  విడుదల చేసిన ప్రతి సంఖ్య వొంట్లో గగుర్పాటు కలిగేలా చేసింది.

కోవిడ్ వల్ల 2021 ఏప్రిల్ నెలలో గతంలో ఎపుడూ  లేనంత మంది చనిపోయారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం  2021 ఏప్రిల్ లో  48,894 మంది చనిపోయారు, గత మార్చిలో కరోనా పాండెమిక్ మొదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు  మొత్తంగా  మరణించిన  2021 ఏప్రిల్ వాటా  23.07 శాతం.

గత ఏడాది కోవిడ్  పాండెమిక్ పతకా స్థాయిలో ఉన్న జూన్ నెలలో సంభవించిన మరణాలు కేవలం 2000.   ఈ నెల 28 తేదీన ఒక్కరోజే 3,645మంది చనిపోయారు. ఇది ఏడాదికి అత్యధిక మరణాల సంఖ్య.

ఈ నెలలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ వల్ల చనిపోయారు.

2021 ఏప్రిల్ నెలలో ఒక్క మహారాష్ట్రలో  14,164మంది చనిపోయారు.  2020 లో పాండెమిక్ మొదలయినప్పటి చి రాష్ట్రంలో చనిపోయినా వారిలో ఇది 20.50 శాతం.

ఢిల్లీలో 5,120 మంది ఈ ఏప్రిల్ లో  చనిపోయారు. ఇది రాష్ట్రంలో పాండెమిక్ మొదలయి నప్పటినుంచి  చనిపోయిన వారి (16,147) లో  32 శాతం.

ఇక కర్నాటకలో చనిపోయిన మొత్తం కోవిడ్ రోగుల్లో 2021 ఏప్రిల్ లో చనిపోయిన వారే  19 శాతం ఉన్నారు.

కరోనా మొదలయి నప్పటినుంచి ఇప్పటిదాకా  నమోదయిన కేసులు 1,91, 64,969. ఇందులో ఈ నెలలోనే వచ్చిన చేరిన కేసులు  69,64 లక్షలు. అంటేమొత్తం కేసులలో ఈ ఏప్రిల్ నెల వాటా 36.23 శాతం.

ఏప్రిల్  31 వ తేదీన రికార్డయిన కొత్త కేసులు 4లక్షలు. ఇది మరొక భయపెట్టే సంఖ్య.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *