ఇండియాలో ఒక పాజిటివ్ కేసు ఎంత మందికి కోవిడ్ అంటిస్తున్నాడు…

పది రోజులుగా రోజూ 3 లక్షలకు పైగా కేసులు :దీని  అర్థమేంటో చెబుతున్నారు శాస్త్రవేత్త డాక్టర్ అనూప్ తెక్కువీట్టిల్

భారతదేశంలో రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు కనిపించడం మొదలై పది రోజులయింది.  దీని అర్థమేమిటో వివరించి చెబుతున్నా కేరళకు చెందిన శాస్త్రవేత్త డాకర్ అనూప్ తెక్కువీట్టిల్. ఆయన  తిరువనంతపురంలోని  శ్రీ చిత్ర తిరునాళ్ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  అండ్ టెక్నాలజీ (SCTIMST)  లో మాలెక్యులార్ మెడిసిన్ లో శాస్త్రవేత్త. దేశంలో కరోనా కేసు తొలిసారి కనిపించినప్పటి నుంచి ఆయన కోరోన వైరస్ మీద పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి  కరోనా వైరస్ పరిస్థితి మీద ఆయన చెబుతున్న విశేషాలు:

ఈ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న గ్రాఫ్ చూస్తే మీకు కేసుల వృద్ధి నిటారుగా  పెరిగిపోతున్నది. దీని పతకాస్థాయి ఎక్కడుందో కనిపించడంలేదు. వూహించలేక పోతున్నాం. అంటే కరోనా వైరస్ వ్యాప్తిని ‘ఆర్’ (Reproduction) వ్యాల్యూ తో కొలుస్తారు. ఆర్ విలువను రోజు కనిపిస్తున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య, వ్యాపిస్తున్న వేగంల దృష్టిపెట్టుకుని R విలువను లెక్కిస్తారు. ఇదొక లెక్క మాత్రమే. కరోనా వ్యాప్తిని వూహించేందుకు , తద్వార నివారణ చర్యలను తీసుకునేందుకు ఒక మార్గదర్శక సూత్రం.

R విలువ 0.5 అంటే ఒకటి కంటే తక్కువ ఉంటే ఇద్దరు కోవిడ్  కేసులు ఒక వ్యక్తికి కోవిడ్ అంటిస్తారని లెక్క. అంటే గ్రాఫ్ పడిపోతున్నదనుకోవాలి. అదే R విలువ ఒకటి ఉంటే  ఒక మనిషి మరొక్కరికి మాత్రం సోకిస్తున్నట్లు లెక్క. ఒక మనిషి ఒకరికి, ఆయన మరొకరికి , ఆయన మరొకరికి కోవిడ్ వ్యాప్తి చేస్తున్నట్లు లెక్క. అదే  R విలువ 2 ఉంటే ఒక మనిషికి ఇద్దరికి, వారు మరొక మరొక నలుగురికి, ,వారు మరొక 8 మందికి సోకిస్తున్న ట్లు లెక్క.  అదే R విలువ 3 అయితే,  ఇంకా ఎక్కువ మందికి సోకుతుంది.  ఒక వ్యక్తి ముగ్గురి, ఆ ముగ్గురు తొమ్మిది మందికి, ఆ తొమ్మిది మంది  27  మందికి సోకిస్తున్నట్లు లెక్క.

ఇపుడు ఇండియా లో R విలువ   2 కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొన్ని చోట్ల మూడుదాకా ఉన్నట్లు సమాచారం. జనవరిలో  R  విలువ 0.9 మాత్రమే ఉండింది. ఒకటి కంటే తక్కువ గా ఉంది కాబట్టి పాండమిక్ తగ్గిపోతున్నదని అనుకున్నాం. అయితే, పరిస్థితి తారుమారయింది. ఇంగ్లండ్ లో రెండోలాక్ విధించాక R విలువ 0.9  నుంచి 0.7 కు వచ్చింది. దీనితో వాళ్ల కరోనా ఆంక్షలు ఎత్తేశారు.

Dr Anoop Thekkuveetti

అందువల్ల కరోనా కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానికి R విలువ పనికొస్తుంది. ఇపుడున్న పరిస్థితిఏమిటి?

కరోనావైరస్ ప్రత్యుత్పత్తి చెందేందుకు (reprouductive rate) మనుషులు (hosts)బాగా దొరుకుతున్నారు. మనుషులు దొరుకుతున్నారు కాబట్టి కరోనావైరస్ జనాభాను రెట్టింపుచేసుకోగలుగుతూ ఉంది.

ఈ దశలోకరోనా వ్యాప్తిని అరికట్టాలంటే దానికి మరొక మనిషి దొరకరాదు. కరోనా పాజిటివ్ కేసులకు 15రోజుల పాటు ఐసోలేషన్ లో పెట్టేది ఇందుకే. ఇపుడు బీహార్, అస్సాంలలో R విలువ  3 దాటింది. R విలువ పెరుగుతున్నపుడు ఐసోలేషన్ ఒక్కటే మార్గం.

మళ్లీ ముదటికి వస్తే, భారత్ లో గ్రాఫ్ నిటారుగా పెరుగుతూ ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి వైరస్ వేగంగా, పెద్ద సంఖ్యలో పెరుగుతూపోతే, తొందర్లోనే  మనంరోజుకు 5 వేల మరణాలను కూడా చేరుకునే ప్రమాదం ఉంది.

 

రోజుకు మూడులక్షల పాజిటివ్ కేసులు వచ్చే నాటికే మన వైద్య వనరులన్నీ అయిపోయాయి. ఇంకా కేసులు పెరిగితే … ఆపరిస్థితిని వూహించడానికే భయమేస్తున్నది.

మే మధ్య కల్లా  రోజూవారీ కేసుల అయిదు లక్షల నుంచి పదిలక్షలకు చేరుకుని మరణాల సంఖ్య 5 వేలకుచేరుకునే ప్రమాదం కనిపిస్తూ ఉంది. Rవిలువ గ్రాఫ్ ను చూసి వ్యాధి వ్యాప్తి శాస్త్ర నిపుణులు చెబుతున్న దిదే. ముందు ముందు చాలా మందికి పది రోజులు ఆసుపత్రి చికిత్స అవసరమవుతుంది. దేశంలో లక్షల మందిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు అసవరమయినపడకలు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, వైద్య సిబ్బంది అందుబాటులో లేనే లేవు.

ఏదో పెద్ద నివారణ చర్య తీసుకొనకపోతే,  దేశం తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.

(Dr Anoop Thekkuveetti కరోనా వైరస్ వ్యాప్తిమీద  Rediff.com కు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *