(టి.జీవన్ రెడ్డి)
ఈటెల రాజేందర్ పై భుఖబ్జాలకు పాల్పడ్డాడని వార్తలు ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి .కేటిఆర్ ను సిఎం చేయాలన్న కేసీఆర్ కోరిక. అదే సమయంలో ఈటెల సిఎం కు అర్హుడు అనే అంశం తెరమీదకు రావడంతో కేసీఆర్ కు మింగుడు పడలేదు. ఈటెల రాజేందర్ సామాజిక స్ఫూర్తి కలిగిన వ్యక్తి .కేసీఆర్ కుట్ర పూరితంగానే ఈటెల పై కక్ష సాధంపునకు పాల్పడుతున్నాడు .
ఈటెల స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి .పౌల్ట్రీ లో ఆయన దశలు దశలుగా ఎదుగుతూ వచ్చారు. కేసీఆర్ ఆస్తులు, ఈటెల ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలు చూస్తారు.
కేటిఆర్ త్రిబుల్ వన్ జీవో ఉల్లంఘించి ఫామ్ హౌస్ నిర్మాణం చేస్తే ఎందుకు విచారణ చేయలేదు?
నీ కొడుకని కేటీఆర్ పై ఆరోపణ లు వస్తే పట్టించుకోవా! మంత్రి మల్లారెడ్డి పై వచ్చిన ఆరోపణలు ఎందుకు పట్టించుకోలేదు? ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూ ఖబ్జాలను ఎందుకు పట్టించుకోలేదు?
కేవలం ఈటెల రాజేందర్ మాత్రమే భూకబ్జాలే కనబడుతున్నాయా! కేసీఆర్ ఓర్వలేని తనం తోనే ఈటెల ను బలిచేయాలని చేస్తున్నారు . ప్రతి సందర్భంలో ప్రజల పక్షాన వాయిస్ వినిపించిన వ్యక్తి ఈటెల రాజేందర్.
ఈటెల రాజేందర్ ఉద్యమ ఫలితంగా కేసీఆర్ సిఎం అయ్యాడు . విచారణ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకుండా, మీడియాకు చెప్పడం ఏమిటి . కేసీఆర్ ఫామ్ హౌస్ పై కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఎందుకు విచారణ జరగలేదు?
ధరణి వెబ్ సైట్ లో ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ భూములు ఎందుకు కలిపించడం లేదు . విచారణ జరగాలంటే . కేసీఆర్ కుటుంబ సభ్యుల అస్తులాపైనా విచారణ జరగాలి .నయీం ఆస్తుల లెక్కలు ఎటు బోయాయి. వక్ఫ్ భూముల అక్రమనపై. దేవాదాయ భూముల అక్రమణపై ఎందుకు స్పందించరు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్ళ నుండి కె.సి.ఆర్కు ఈటల,హరీష్ అండగా నిలిచారు.
మిగతా వాళ్ళందరూ బిటి బ్యాచ్. కొడుకు,బిడ్డ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు.2004 లో కేంద్ర మంత్రిగా కేసీఆర్ మంత్రి పదవి చెప్పట్టిన తరువాత కేటీఆర్,కవిత తెలంగాణ కు దిగుమతి అయ్యారు.కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే… కరోన సమయంలో ఈటలా పని చేస్తున్నారు. విచారణ అధికారులు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందిచాలి కానీ మీడియా కు నివేదిక ఇస్తున్నారు. కలెక్టర్ ఒక్క నిర్ణయనికి వచ్చాక ప్రభుత్వం ఎందుకు రిటైర్ కలెక్టర్ ధర్మారెడ్డి భూములను ఈటల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చారు అన్నారు. మరి అప్పుడు ధర్మ రెడ్డి ఏమి చేశారు?
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర బలవంతంగా కేసీఆర్ భూములను తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.కేసీఆర్ పెద్ద బావి తవ్వితే చుట్టు పక్కల బావిలు ఎండిపోయాయి. ధరణి వెబ్ సైట్ కేసీఆర్ పేరు మీద ఎర్రవెల్లి లో భూములు లేనట్లుగా చూపిస్తున్నాయి.ఎందుకు కేసీఆర్ భూముల దాపరికం.కేసీఆర్ కుటుంబం గతంలో ఆస్తులు ఎంత?ఇప్పుడు ఎంత బహిరంగ విచారణకు రావాలి.మంత్రి మల్లారెడ్డి బెదిరింపు వాయిస్ మీద ఎందుకు విచారణ జర్పించడం లేదు.
(ఇవి జీవన్ రెడ్డి ఈ రోజు విలేకరుల సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు)
(జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ,తెలంగాణ కాంగ్రెస్)