భరూచ్ : గుజరాత్ భరూచ్‌లోని పటేల్ వెల్ఫేర్ కొవిడ్ సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది కరోనా బాధితులు మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) పూర్తిగా దగ్ధమయింది. వార్డులోని వెంటిలేటర్స్ రిఫ్రెజిరేటర్లు, పరుపులు అన్న కాలిపోయాయి. ఆసుపత్రి మొత్తం మృతుల బంధువుల రోదనతో హృదయవిదారకంగా మారిపోయింది.
మంటలు చెలరేగగానే ఫైరింజన్లు వచ్చి ఒక వైపు మంటలను అదుపు చేస్తుంటే ఆసుపత్రి పరసరాల్లోని ప్రజలు రంగంలోకి దూకి రోగులను కాపాడేందుకు ప్రయత్నించారు. చాలా మందిని అంబులెన్స్ లలో, రిక్షాలలో ఇతర అసుపత్రులకు తరలించారు.
ఐసియులో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది కోవిడ్ రోగులు మంటలకు ఆహుతయ్యారు. మిగతా ఆరుగురు మంటల్లో చిక్కుకుని చనిపోయారా లేక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్నపుడు చనిపోయారా అనేది తెలియడం లేదని అధికారులు చెప్పారు. ఆగ్నిప్రమాదం ఎలా జరిగిందో ఇంకా తెలియడం లేదు. మంటలను ఒకటి రెండు గంటల్లోనే అదుపులోకి తెచ్చారు.
మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రూపానీ రు. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Gujarat| Fire breaks out at a COVID-19 care centre in Bharuch. Affected patients are being shifted to nearby hospitals. Details awaited. pic.twitter.com/pq88J0eRXY
— ANI (@ANI) April 30, 2021