కోవిడ్ మూడో వేవ్ ఎందుకొస్తున్నది? మూడో వేవ్ చివరిదవుతుందా?

(TTN Science Desk)

రెండో వేవ్ ప్రపంచంలో చాలా చోట్ల ఇంకా పూర్తికాలేదు. ప్రజలు కోవిడ్ సోకి పిట్టల్లా రాలిపోతున్నారు. కోవిడ్ ఉథృతిని తట్టుకునేంత వైద్యవసతులు ప్రపచంలో ఏదేశంలో లేవు. ఉన్న వైద్య వసతుల మీద భారం తీవ్రమయింది. ఫలితంగా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

భారత్ లో ప్రపంచంలో ఎక్కడా లేనంత హృదయ విదారక పరిస్థితులున్నాయి. ఇలాంటపుడు బాగా బలం సమకూర్చుకుని కరోనావైరస్ మూడో సారి ప్రపంచం మీద దాడిచేసే ముపు వస్తున్నదని చెబుతున్నారు.

మార్చిలలోనే బ్రిటన్ మూడో వేవ్ గురించి హెచ్చరిక చేసింది.  మూడో ఈసారి యూరోప్ దేశాలనుంచి వస్తున్నది జాగ్రత్తపడండి బ్రిటన్ ప్రధాని జాన్ బోరిస్  హెచ్చరిక చేశారు. మూడో వేవ్ ఎలా ఉంటుందని తయారుచేసిన ఒక కంప్యూటర్ మోడల్ ప్రకారం బ్రిటన్ లో  కరోనా మూడో దాడిలో 2022 వేసవి నాటికి మరొక 30,000 మందిచనిపోతారు. వ్యాక్సిన్ ల వాడకం పెరిగినా ఈ మరణాలు సంభవిస్తాయని బిబిసి రాసింది. ఎందుకు?

కెనడాలో ధర్ద్ వేవ్ ప్రవేశించింది.  కెన్యా కూడా మూడో వెవ్  వచ్చిందని నిర్ధారించింది.

ఇజ్రేల్ ని కూడ థర్ద్ వేవ్ తాకింది. మార్చిలో  ఇది మొదలయింది. ఇజ్రేల్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో థర్ద్ వేవ్ చివరి వేవ్ అయింది. ఇంతవరకు ఇజ్రేల్ మీద రెండు వైరస్ రకాలు దాడి చేశాయి. బ్రిటన్ వేరియాంట్ తో  మూడో వేవ్ మొదలయింది. ఆరువేల మంది చనిపోయారు. తర్వాత వ్యాక్సిన్ లు వాడటం, మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలన్న నియమాలను  కఠినంగా అమలుచేయడంతో  పరిస్థితి చక్కబడింది. అంతా అనుకున్నట్లే ఇజ్రేల్ ధర్ద్ వేవ్ ను లాస్ట్ వేవ్ చేసింది.

ఇపుడు ఇజ్రేల్ ఫేస్ మాస్క్ ల నియమం తొలిగించారు, ప్రజలు మాస్క్ లను తీసి పడేసి హమ్మయ్య అని ఊపరిపీల్చుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాయి.

బ్రెజిల్ లో కూడా ధర్డ్ వేవ్ ప్రవేశించింది. ధర్ద్ వేవ్ యూరోప్ ని కుదిపేస్తూ ఉంది. అమెరికా లో ఇపుడు కొనసాగుతున్నది మూడో వేవ్ అని ఫోర్బ్స్ రాసింది. అమెరికాలో మూడో వేవ్  గత రెండు వేవ్ ల కంటే ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంది.

భారతదేశంలో…

భారత దేశంలో  కరోనా మూడో సునామీ వస్తున్నదంటున్నారు. ఇదేదో వాట్సాప్, సోషల్ మీడియా గాలికబురు కాదు. స్వయాన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ ధాకెరే  చెప్పారు.  ప్రభుత్వాలు ఎందరో నిపుణులను సంప్రదిస్తూ ఉంటుంది.  ఇలాంటి నిపుణులతో మాట్లాడేకే తానీ హెచ్చరిక చేస్తున్నానని ధాకెరే చెప్పారు. ఈ మూడో వేవ్ జూలై, ఆగస్టులలో రావచ్చని కూడా ఆయన చెప్పారు. దీనికి సిద్ధంగా ఉండాలని ఆయన పరిపాలనా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేశారు. ఇపుడు దేశంలో మరీ ఆధ్వాన్నమయిన పరిస్థితిలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్రయే. కాబట్టి మూడో దెబ్బకొడితే పర్యవసానాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని, అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఆక్సిజన్, ఔషధాలు, ఇతర కరోనా నివారణ  ఏర్పాట్లను తక్షణం చేసుకోవాలని ఆయనఅధికారులనుఅప్రమత్తం చేశారు. ఈ నిపుణుల ప్రకారం మే చివర్లోకరోనా కేసులు తగ్గినట్లనిపిస్తుంది.

కరోనా మూడో వేవ్ ఎందుకొస్తుంది?

మొదటి వేవ్ కంటే రెండో వేవ్ సులభంగా వస్తుంది. రెండో వేవ్ కంటే మూడో వేవ్  సులభంగా వస్తుంది. దీనికి సమాధానం ఏమంత కష్టంకాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మాస్కులు చాలా కాలం ధరించి, ధరించి, అలసిపోయి (Covid-fatigue)చాన్స్ దొరికినపుడల్లా కొద్ది సేపే మాస్క్ తీసేయాలనుకోవడం వల్ల వైరస్ మళ్లీ దాడిచేస్తున్నదా? లేక స్కూళ్లు, కాలేజీలను పాక్షికంగా తెరవడం వల్ల వస్తున్నదా? లేక సీజన్లు మారుతున్నందున అపుడుపుడు ఇలా కరోనా వైరస్ గెరిల్లా దాడి చస్తూ ఉంటుందా? అనేవి మూడో ఎందుకొస్తుందనే ముందున్న ప్రశ్నలు.

గతంలో కంటే కరోనా వైరస్ విస్తృతి బాగా పెరిగినందున మూడో వేవ్ వచ్చేందుకు ప్రధాన కారణమయి ఉంటుందని ప్రొఫెసర్ జాన్ డ్రేక్ (John Drake, University of Geogia, US) ఆ మధ్య ఫోర్బ్స్ లో రాశారు.

“What I conclude is that the current wave of Covid-19 is only partly driven by changes in transmission- and these changes in transmission are a smaller part. The bigger factor is the overall larger size of the epidemic at the onset of the third wave compared with the previous waves,”అని ప్రొ. జాన్ డ్రేక్ రాశారు.

వైరస్ విస్తృతి గురించి ఆయన  వివరణ ఇచ్చారు. వైర ఎస్ ఎంతమంది సోకిందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, వీళ్లలో ఎక్కువ మందికి రోగలక్షణాలుండవు. అయితే, రోజు  పరీక్షల్లో తేలే కేసులు వైరస్ విస్తృతి గురించి కొంత వరకు అర్థం చేసుకునేందుకు పనికొస్తుంది. ఇలాంటపుడు వైరస్ జీవితకాలం, భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి వైరస్ నివారణ చర్యలు బట్టి వైరస్ వ్యాప్తి ఉంటుంది.

రెండో వేవ్ నాటికి కరోనా ఎక్కడ చూసిన వ్యాపించి ఉంటుంది. మొదటి వేవ్ వచ్చినపుడు కోవిడ్ ఇంకా వ్యాప్తి చెందలేదు కాబట్టి, మీకు కోవిడ్ సోకిన వక్తులు తారసపడటం తక్కువగా ఉండేంది రెండో వేవ్ వచ్చనాటికి కోవిడ్ సోకిన వక్తులు తారసపడటం ఎక్కవవుతుంది.  మూడో వేవ్ వచ్చేనాటికి కోవిడ్ సోకి వ్యక్తుల సంఖ్య విపరీతంతా పెరగడమే కాదు, సర్వత్రా వ్యాపించి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు, మీకు షాపుల్లో, హోటళ్లలో, రిసార్టలలో, మాల్స్ లలో, బస్సుల్లో, రైళ్లలో సినిమా హాళ్లలోర, హోమ్ డెలివరీ సర్వీసులలో ఎక్కడయినా జరగవచ్చు. అందుకే కరోనా వైరస్ మూడోసారి దాడి చేసే అవకాశం ఎక్కువ గా ఉంటుందని ప్రొఫెసర్ డ్రేక్ చెప్పారు.  దీనికి తోడు ట్రాన్సిమిషన్ మార్గాలు కూడా ఎక్కువవుతాయి. ఏ మార్గాలలో వైరస్ వ్యాపిస్తుందో ఇంకా స్పష్టత లేదు, గాల్లో నుంచి వస్తుంద, రక్తం నుంచి వస్తుందని, మలపదార్థాలు నుంచి వస్తుందని చెబుతున్నారు. ఒక వేళ ఇదే నిజమయితే,కోవిడ్ రోగుల సంఖ్య రోజూ  నాలుగు లక్షలకు చేరుతున్నపుడు ట్రాన్స్ మిషన్ మార్గాలు ఎన్నో రెట్లుపెరుగుతాయి. మూడో వేవ్  ఉధృతంగా, చాలా విస్తృతంగా ఉంటుదనేందుకు ఇవన్నీ కారణాలు.

అయితే,ఊరట కలిగించే విషయం ఏమిటంటే, మూడో వేవ్ వచ్చేనాటికి  ప్రజలందరిలో కరోనావైప్ గురించి విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. తమ పక్కనే కరోనా వైరస్ ఉందనే విచక్షణ పెరుగుతుంది. దీని వల్ల కొంతమంది నివారణ చర్యలు కచ్చితంగా కఠినంగా అనుసరిస్తారు.

కాబట్టి ఇజ్రేల్ లాగా ప్రపంచంలోని అన్నిదేశాలు  మూడోవేవ్ నే చివరి వేవ్ చేసుకోవాలి, సాధ్యమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *