* కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన 18-45 సంవత్సరాల మధ్య వయస్కులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే మూడో దశ ఇమ్యూనైజేషన్ కార్యక్రమం మే 1 న మొదలు కాకపోవచ్చు. చాలా రాష్ట్రాలు (ఆంధ్ర, కర్నాటక, తెలంగణ వగైరా)వ్యాక్సిన్ కొరత వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాయి.
* భారతదేశంలో గత 24 గంటలలో 3,86,452 కొత్త కేసులను నమోదు చేసినా, వాస్తవ సంఖ్య ఇంతకంటే అయిదు నుంచి పదింతలయినా ఎక్కువగా ఉంటుందని చాలా మంది నిపుణులు అనుమానిస్తున్నారు.
*ఫిబ్రవరి నెలాఖరు నుంచి భారతదేశం ప్రపంచ కోవిడ్ లోడ్ కు 7 కోట్ల 70లక్షల కొత్త కేసులను జోడించింది.
*అంతకు ముందు ఇండియాలో 7.7 మిలియన్ కేసులు కనిపించడానికి ఆరు నెలలు పడితే, ఇపుడు రెండు నెలలే పట్టింది.
*వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలో నెంబర్ వన్ దేశం భారతదేశమే. అయితే, ఇపుడు దేశంలో వ్యాక్సిన్ కొరత పీడిస్తూ ఉంది. మే 1 నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన మూడో దశ వ్యాక్సినేషన్ చాలా రాష్ట్రాల్లో వాయిదా పడేందుకు కారణం ఇదే.
*ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 18-45 సం. వయసు వారికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం కనీసం పది హేనురోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వయంగా ప్రకటించారు.
*ఇంతవరకు భారత దేశం జనాభా (140 కోట్లు)లో వ్యాక్సిన్ అందింది కేవలం 9 శాతానికే.
*ప్రభుత్వ కార్యాలయాల్లో,పరిశ్రమల్లో కోవిడ్ సోకి విధులు మానేస్తున్న వారి సంఖ్య, కుటుంబ సభ్యులు కోవిడ్ బారినపడటంతో వారి సేవలకోసం శెలవు పెడుతున్నవారి సంఖ్య పెరిగింది.
*16 సంవత్సరాల తర్వాత భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలనుంచి సాయం తీసుకోవలసి వస్తున్నది. ఆమెరికా నుంచి మాస్కులు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్స్ తో రెండు యుద్ధ విమానాలు శుక్రవారం భారత్ వచ్చాయి.
*భారత్ కు పది కోట్ల డాలర్ల (100 మిలియన్ డాలర్లు) విలువయిన వైద్యసాయం చేసేందుకు అమెరికా ముందుకు వచ్చింది.
*మే 1 వ తేదీన రష్యా తయారు చేసిన స్పుత్నిక్ -5వ్యాక్సిన్ తొలి బ్యాచ్ మే 1 భారత్ లో దిగుతుంది.
*భారతదేశంలో ఇంత ఉధృతంగా కోవిడ్ వ్యాప్తి చెందేందుకు కారణం ఇక్కడి ప్రజల్లో పెరిగిన రోగనిరోధక శక్తిని హరించే కరోనావైరస్ రకం (Escape Variant)కారణమయి ఉండవచ్చని అమెరికా యూనివర్శిటీ అఫ్ వాషింగ్టన్ కు చెందిన డిసీజ్ మాడెలర్ (Disease modeller) క్రిస్ ముర్రే (Chris Murray) అనుమానిస్తున్నారు. ఇపుడు భారతదేశంలో కనిపిస్తున్న వేరియాంట్ B.1.617 అదేనేమో అని ఆయన అనుమానిస్తున్నారు.