ఆయన ఆస్పత్రి ఎదుటే కుప్పకూలారు. ‘మీరంతా హంతకులు : ఆస్పత్రి సిబ్బందిపై విరుచుకుపడిన అశోక్ అమ్రోహి సతీమణి
(రాఘవ శర్మ)
భారత మాజీ రాయబారి అశోక్ అమ్రోహి ఆస్పత్రి ఎదుటే కుప్ప కూలారు.
ఐదుగంటలు ఆసుపత్రి ఎదుట ఎదురుచూసినా బెడ్ దొర కక పోవడంతో తుది శ్వాస విడిచారు. ఈ విషాద సంఘటన మంగళవారం అర్ధ రాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని గుర్‌గాన్స్ మేదాంత ఆస్ప్రతి ఎదుట జరిగింది.
అశోక్ అమ్రోహి గతంలో బ్రూనే, బొజాంబిక్, అల్జీరియా దేశాలకు భారత రాయబారిగా పనిచేశారు.అయిదు రోజులుగా అశోక్ అమ్రోహి ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చేరాలని డాక్టర్లు సూచించినట్టు ఆయన సతీమణి యామిని అమ్రోహి తెలిపారు.
భారత దేశంలో ప్రస్తుతం కరోనా రెండవ దశం విధ్వంసాన్ని సృష్టిస్తోంది.రెండు రోజుల క్రితం వరకు మూడున్నర లక్షల మంది వైరస్ బారిన పడ్డారు.
దేశంలో ఇతర ప్రాంతాలలాగానే , రాజధాని ఢిల్లీలో కూడా అస్పత్రులలో కరోనా రోగులకు చికిత్స చేయడానికి బెడ్‌ల కొరత, ఆక్సీజన్, మందుల కొరత తీవ్రంగా ఉంది.
మేదాంత ఆస్పత్రిలో ఆరోజు రాత్రి 8 గంటలకు బెడ్ దొరుకుతుందని చెబితే, అశోక్ అమ్రోహి ఏడున్నరకే అక్కడి చేరుకు న్నారు.
ముందు కోవిడ్ టెస్ట్ చేసుకున్న అమ్రోహి అక్కడే కారులో ముందు సీటులో గంటన్నర వేచి ఉన్నారు.కోవిడ్ టెస్ట్ అనంతరం అతని కుమారుడు ఆస్పత్రిలో అడ్మిషన్ కోసం క్యూలో నిలుచుకున్నాడు.అడ్మిషన్ ఎప్పుడు దొరుకుతుందో చెప్ప లేని విధంగా ఉంది.
మూడు సార్లు ఆస్పత్రి నిర్వహకుల వద్దకు వెళ్ళి అరిచాడు, ఎడ్చాడు. అయినా ఫలితం లేదు. అమ్రోహి హృదయ స్పందన ఆగిపోతోంది, కానీ ఎవరూ సహాయం చేయ డం లేదు.
అమ్రోహి కారులోనే కూర్చుని గుర్తు చేశారు. కనీసం వీల్ చైర్, స్ట్రెచర్ ఇవ్వలేదు.వారు ఏం చెప్పారో తెలుసా!?
‘అడ్మీషన్ విధానం పూర్తి అయ్యాకే అవ్వన్నీ చూస్తాం ‘ అన్నారు. ఆయన కుమారుడు క్యూ వదిలి, మళ్ళీ వాళ్ళకు తన తండ్రి పరిస్థితిని గుర్తు చేశాడు.
మీ అడ్మిషన్ ఇప్పుడే అయిపోతుందని సమాధానం వచ్చింది.అమ్రోహి కారులో అవస్థలు పడుతుండగానే వారికి ఆక్సీజన్ సిలిండర్ లభించింది. కానీ, అది వారికి ఉపయోగపడలేదు.
చివరికి అమ్రోహి ఊ పిరి అడక మాస్క్ తీసేస్తుంటే, కుటుంబ సభ్యులు బలవంతంగా పెట్టారు. ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఊపిరాడడం లేదు.
ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రాథమిక చికిత్సగా కొడుకు వీపులో చరిచాడు.అర్ధరాత్రి అయినా అడ్మిషన్ దొరకలేదు.
బారత మాజీ రాయబారి అమ్రోహి కారులోనే కళ్ళు మూతలు పడుతున్నా యి. ‘నాన్నా అడ్మిషన్ దొరికింది లే ‘అని కొడుకు తండ్రిని వేడుకున్నాడు. ఆయినా ఆయన కళ్లు తెరవలేదు.
ఆయనకు ఆడ్మిషన్ దొరకడానికి కాగితాలపైన పనులు మాత్రం పూర్తి అయ్యాయి. కానీ, ఆయన మాత్రం లేరు.
‘మీరంతా హంతకులు ‘ అని యామిని అమ్రోహి ఆస్పత్రి సిబ్బంది పైన విరుచుకుపడింది.
విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సహాయాన్ని మీరు కోరి ఉండవచ్చు కదా! అని అడిగితే, మంత్రి ఏం చేస్తారు చెప్పండి? అని ప్రశ్నించారామె.
విదేశీ వ్యవహారాల శాఖలోని పలువురు అధికారులు అస్పత్రిలో బెడ్ల కోసం ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నారు. అస్పత్రిలో బెడ్ దొరకక, ప్రోణాలు కోల్పోయిన విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి అశోక్ అమ్రోహి శవం ఉన్న అంబులెన్స్ తిరిగి వెళ్ళాక ఆ శాఖ ముందుకు కదిలినట్టు సమాచారం.
దీనిపై వ్యాఖ్యానించమని మేదాంత ఆస్పత్రిని ‘ద వైర్’ కోరింది.
వారి స్పందన తెలియాల్సి ఉంది.
అశోక్ అమ్రోహి తనకు మంచి మిత్రుడని, అంకిత భావంతో పనిచేసే సహోద్యోగి అని భారత విదీశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అంతా అయిపోయాక ట్వీట్ చేశారు.
అమ్రోహి పనిచేసిన వివిధ దేశాల లో ఆయనను అభిమానించే వారి నుంచి పెద్ద ఎత్తున నివాళులు వెల్లువలా వచ్చాయి.
ఖతార్‌లోలోని భారత రాయబార కార్యాలయంలో తొలి కార్యదర్శిగా పనిచేసిన ఆయన గొప్పతననాన్ని అక్కడి భారతీయులు తమ సంతాప సందేశాల్లో తెలిపారు.
కానీ, ఆయన మాతృభూమిలో చికిత్సకు ఆస్పత్రిలో చోటు మాత్రం దొరకలేదు.
ఇక సామా న్య ప్రజల పరిస్థితి ఏమిటి!?
(ద వైర్ thewire.in సౌజన్యంతో )