మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే ఫిర్యాదు మీద ముఖ్యమంత్రి కెసిఆర్ విచారణకు ఆదేశించారు.
ఈ కుంభకోణాన్ని ఈ రోజు కెసిఆర్ కుటుంబ సభ్యుల న్యూస్ చానెల్ టి.న్యూస్ ‘సాక్ష్యా’లతో సహా పకడ్బందీగా ’బయట’పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం మీద మెదక్ జిల్లా కలెక్టర్ ద్వారా విచారణ జరిపించి సమగ్ర నివేదికను తెప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డిజి పూర్ణచందర్ రావు ని కూడా సిఎం అదేశించారు.
ఈ నివేదికలు అందగానే ఈటలను అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ ఉంది.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/breaking/eatala-in-land-scam-likely-to-be-arrested/