‘వర్క్ ఫ్రం హోమ్’ వసతి కోరుతున్న ఎపి ప్రభుత్వోద్యోగులు

 

★ తక్షణమే కరోనా బారిన పడిన ఉద్యోగులకు 14 నుండి 30 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయండి.

★ కరోనా బారిన పడ్డ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో బెడ్స్ సోకర్యం కల్పించండి.

 

కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ వలన ఉద్యోగులు రోజు రోజుకి అనేక మంది చనిపోతున్న పరిస్థితులు, ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ నందు చేరుతున్న వేలాదిమంది ప్రత్యేకంగా ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగుల భద్రత పై ప్రభుత్వం తక్షణ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ‘AP JAC అమరావతి’ బొప్పరాజు, వై వి రావు, VV మురళీకృష్ణ నాయుడు విజ్ఞప్తి చేశారు.

దీనికోసం అన్నింటికంటే ముఖ్యంగా కరోనా ఉధృతి తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు, ఉద్యోగులందరికి వర్క్ ప్రం హోమ్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు.

ఈ రోజు    ముఖ్యమంత్రి  అదనపు ప్రధాన కార్యదర్శి కె దనంజయ రెడ్డి కు, , ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి ని కలుసుకుని భయానకంగా మారుతున్న కోవిడ్ పరిస్థితి గురించి  ఉద్యోగులు వివరించారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన ఉద్యోగుల భద్రత కొరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే ఉద్యోగులు ప్రత్యేకంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా వైరస్ నివారణకు చేస్తున్నారు.

ఇప్పటికే అత్యంత భద్రతా ప్రమాణాలు కల్గిన సచివాలయంలో నే దాదాపు 8 మంది ఉద్యోగులతో పాటుగా, మిగిలిన శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లాలలోని వివిధ కార్యాలయాలలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు మృత్యువు బారిన పడ్డారు., వేలాదిమంది హాస్పిటల్స్ నందు చికిత్స పొందుతున్నారు.

సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా రోజు రోజుకి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు.

 


ఉద్యోగిని ఒక వ్యక్తిగా చూడొద్దని, ఒక కుటుంబం గా చూడాలి.


రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు కొంత ధైర్యం, భరోసా కలిగించే ఏఏ చర్యలు తీసుకోవాలో ‘AP JAC అమరావతి’ వివరించింది.

ఉద్యోగుల నాయకులు సూచించిన చర్యలు:

● కేంద్ర ప్రభుత్వం DoPT ద్వారా వారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల వర్క్ ప్రం హోమ్ ఇచ్చినట్లే   కరోనా ఉధృతి తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు, ఉద్యోగులందరికి వర్క్ ప్రం హోమ్ సౌకర్యం కల్పించాలి.

● కరోనా బారిన పడిన ఉద్యోగులకు గతంలో కలరా, మచూచి, చికెన్ & స్మాల్ ఫాక్స్ తదితర ప్రమాదకరమైన వైరస్ లు వచ్చినప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం U.O.Note No.82809/37/11-FR I/64-2 Fin.(FR-I) Dept. Dt.3.4.1965 ప్రకారం 21 నుండి 30 రోజులవరకు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరుచేసింది., అలాగే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్ తదితర ప్రభుత్వాలు కూడా  ఉద్యోగులకు 14 నుండి 28 రోజుల వరకు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణమే కరోనా బారిన పడ్డ ప్రభుత్వ ఉద్యోగులందరికి 21 రోజులనుండి 30 రోజుల వరకు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలి.

● ముందు వరుసలో ఉండి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తూ కరోనా బారిన పడ్డ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, ఉద్యోగులకు, ప్రత్యేకంగా ఫీల్డ్ స్టాఫ్ కు అవసరమైన మేరకు ఆసుపత్రుల్లో బెడ్స్ కల్పించుటకు  ప్రత్యేక విధి విధానాలు ఖరారు చేయాలి.

● రాష్ట్రంలో ని అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్ నిబంధనలు మేరకు చర్యలు అనగా డీ-సానిటైజేషన్, మాస్కులు, సానిటైజర్లు, ధర్మల్ స్కానర్స్ తదితర నివారణ చర్యలు తీసుకోవాలని, దానికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కేటాయించాలి.

 

అదనపు కార్యదర్శి ధనంజయ్ రెడ్డి, ముఖ్య సలహాదారు  సజ్జల  మాట్లాడుతూ ఉద్యోగులు  ప్రాణాలను సహితం లెక్కచేయకుండా, కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.  ఉద్యోగులు లేవనెత్తిన విషయాలు  ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లి తగిన విధంగా వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *