దేశంలో ఒక వైపు సెకండ్ వేవ్ కరోనా కేసులు ఉధృతమవుతుంటే మరొక వైపు బంగారు డిమాండ్ కూడా పెరుగుతూవచ్చింది. జనవరి-మార్చి క్వార్టర్ లో బంగారు డిమాండ్ 37శాతం పెరిగి 140 టన్నులకు చేరుకుంది. వాల్యూ పరంగా ఇది 57 శాతం పెరుగుదల. గత ఏడాది తో పోలిస్తే ఈ పెరిగిన డిమాండ్ విలువరు. 58,800 కోట్లు. ఈ విషయన్న ప్రపంచ బంగారు సంస్థ (World Gold Council WGC) ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా బంగారు డిమాండ్ 23 శాతం పడిపోయినపుడు భారత్ లో డిమాండ్ పెరగడం విశేషం. అంతర్జాతీయంగా గత ఏడాది డిమాండ్ 815.7 టన్నులు.
కరోనాకాలంలో కూడా బంగారు ధర పెరిగేందుకు కారణమేమయి ఉంటుంది?
జనవరిలో పాండెమిక్ నుంచి భారతదేశంలో కోలుకుంటున్న సూచనలు కనిపించడం, కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుకావడం జనవరి-మార్చి క్వార్టర్ లో గోల్డ్ డిమాండ్ పెరిగేందుకు ప్రధానకారణమని WGC పేర్కొంది. ఈ మూడు నెలల కాలంలో ఆభరణాల డిమాండ్ 39 శాతం పెరిగింది. విలువకు సంబంధిం 58 శాతం (రు. 43,100కోట్లు) పెరుగుదల.
“India’s gold demand in the March quarter rose on the back of Covid containment and positive sentiment following start of the vaccination program. A combination of softening gold prices, buoying consumer sentiment following sharp pick-up in economic activity, and return of social activities like weddings supported growth in gold jewelry demand,” WGC ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పి ఆర్ సోమసుందరం తెలిపారు.
ఈ క్వార్టర్లో సగటు పది గ్రాముల బంగారు రు. 47,131పలికింది. గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ, అదే క్వార్టర్ పోలిస్తే ఆరు శాతం తక్కువ.. అయితే, 2020 ఆగస్టునాటిధరతో పోలిస్తే 16శాతం తక్కువ. ఆయేడాది బంగారు సగటున పదిగ్రామలు ధర రు 56,000 పలికింది.
20 సంవత్సరాల వెనక్కు వెళ్లిన బంగారు
లాక్ డౌన్ కాలంలో బంగారు బాగా మసక బారింది.
బంగారు డిమాండ్ ఎంతగా పడిపోయిందటే ఏకంగా 25 సంవత్సరాల వెనక్కి పోయింది. 2020లో డిమాండ్ 446 టన్నులకు పడిపోయింది. 2019లో ఇధి 690.4 టన్నులుండింది. గతంలో ఇంత దారుణంగా బంగారు డిమాండ్ పడిపోయింది 1995లో. అపుడు డిమాండ్ 462 టన్నులు మాత్రమే. ఇక ఆభరణాల డిమాండ్ 42 శాతంపడిపోయి 315.9 టన్నులకు దిగింది. అదే 2019లో 544.6 టన్నులు.