హైదరాబాద్ ఆసుపత్రిలో బెడ్, ఆక్సిజన్ దొరక్క ఓ ప్రైవేటు అసుపత్రిలో సీనియర్ జర్నలిస్ట్ గోపిరెడ్డి సంపత్ కుమార్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆసుపత్రి అధికారులు బెడ్స్ లేవని చెప్పడం తో కుర్చీలో కూర్చుని వైద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు.దీనితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయనకు ఏదో విధంగా బెడ్ సంపాదించేందుకు ‘సేవ్ సంపత్’ పేరులో స్నేహితులు రంగంలోకి దిగారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఎపుడూ ముందుండిన సంపత్ ను ఆదుకోవాలని హైదరాబాద్ జర్నలిస్టులు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటలరాజేందర్ ను కోరుతున్నారు. ఆయనకు ఆర్థిక సాయం చేలయదలచిన వారు 9908947904 Sampath Kumar గూగుల్ పే ద్వారా పంపించాలని మిత్రులు కోరుతున్నారు.