భారతదేశం విపత్తుల్లో విదేశీ సాయం తీసుకోవడం మానేసి ఇప్పటికి 16 సంవత్సరాలయింది. భారత్ కు ఎంత విపత్తునయినా ఎదుర్కొనే శక్తి ఉందని, తక్షణ సాయం అవసరం లేదని, అవసరమయినపుడు అడుగుగామని 2004 లో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రకటిచింది.అప్పటి నుంచి భారతదేశం సాయం చేయడం తప్ప ఆర్తించలేదు.
2004 డిసెంబర్ లో సునామీ వచ్చినపుడు కూడా భారతదేశం ఏ దేశ సాయం తీసుకోలేదే. ప్రపంచంలోని అనేక దేశాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. 2005లో కాశ్మీర్ లో భూకంపం వచ్చినపుడు గాని, 2013లో ఉత్తరా ఖండ్ వరదలపుడు గాని, అదే విధంగా 2014లో కాశ్మీర్ వరదలపుడు గాని భారత్ విదేశీ సాయంతీసుకోలేదు. అన్నింటిని స్వయంగా ఎదుర్కొని అజేయంగా నిలిచింది.
కాని కరోనా భారతదేశ స్థయిర్యాన్ని దెబ్బతీసింది. కోవిడ్ తో సతమతమవుతూ ఇపుడు అన్ని దేశాలనుంచి సాయం అందుకునే పరిస్థితి వచ్చింది.
బంగ్లాదేశ్-పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఇండియా కు సహాయం చేస్తాం అన్న పరిస్థితికి దేశం వచ్చింది.
ఈ రోజు అమెరికా యుద్ధవిమానం భారత్ కు కోవిడ్ సాయంతో బయలుదేరింది. ఈ విమానంలో 440 ఆక్జిజన్ సిలిండర్లు, ఒక లక్ష N9మాస్కులు, పదిలక్షల ర్యాపిడ్ డయాగ్నోష్టిక్ టెస్టుకిట్లతో పటు మరక 25 మిలియన డాలర్ల విలువచేసే ఇతర సామగ్రి ఉన్నాయి.