భారత్ కు సాయం చేసేందుకు 40 దేశాలు ముందుకొస్తున్నాయ్…

కరోనా రెండో తరంగం విపత్తు ఎదుర్కొంటున్నభారత దేశానికి సాయం చేసేందుకు దాదాపు 40 దేశాలు సంసిద్ధంగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్ స్రింగ్లా చెప్పారు.

ఇప్పటికే రష్యా యుద్ధవిమానాలు  భారీ సాయం మోసుకొచ్చాయి. రెండు విమానాలు  20 ఆక్సిజన్ తయారీ ప్లాంట్ లతో,  2 లక్షల  ఔషదాల పొట్లాలతో,  వెంటిలేటర్స్ తో ఢిల్లీలో దిగాయి. ఇలాంటి సాయమే తీసుకొస్తున్న అమెరికా యుద్ధవిమానాలు ఏక్షణాన్నయినా ఢిల్లీలో దిగవచ్చు.  దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో ఈదేశాన్నీ ఆక్సిజన్ కు సంబంధించిన సాయం భారీగా చేస్తున్నాయి.

రష్యా విమానాలు దిగిన సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ యుద్ధవిమానాలు దేశంలో దిగేందుకు తగిన అనుమతులును సంపాదించే పనిలో విదేశీ వ్యవహారాల శాఖ నిమగ్నమయి ఉందని ఆయన చెప్పారు. విదేశాలలో ఉండే భారత రాయబార కార్యాలయాలు దేశానికి అత్యవసరమయిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ తయారీ యూనిట్ల, రెమ్డిసివర్, టోసిలిజుమాబ్ వంటి ఇంజక్షన్ల జాబితా తయారు చేసుకుని వాటిని సేకరించే పనిలో ఉందని ఆయన చెప్పారు. దేశం అవసరాలను బట్టి భారత రాయబారులు విదేశీ ప్రభుత్వాలత్ సంప్రదింపులు జరుపుతున్నారని  స్రింగ్లా తెలిపారు.

ఇది ఇలాఉంటే…

భారతదేశం విపత్తుల్లో విదేశీ సాయం తీసుకోవడం మానేసి ఇప్పటికి 16 సంవత్సరాలయింది. భారత్ కు ఎంత విపత్తునయినా ఎదుర్కొనే శక్తి ఉందని, తక్షణ సాయం అవసరం లేదని, అవసరమయినపుడు అడుగుగామని  2004 లో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రకటిచింది.అప్పటి నుంచి భారతదేశం సాయం చేయడం తప్ప ఆర్తించలేదు.

2004 డిసెంబర్ లో సునామీ వచ్చినపుడు కూడా భారతదేశం ఏ దేశ సాయం తీసుకోలేదే. ప్రపంచంలోని అనేక దేశాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.  2005లో కాశ్మీర్ లో భూకంపం వచ్చినపుడు గాని, 2013లో ఉత్తరా ఖండ్ వరదలపుడు గాని,  అదే విధంగా 2014లో కాశ్మీర్ వరదలపుడు గాని భారత్ విదేశీ సాయంతీసుకోలేదు. అన్నింటిని స్వయంగా ఎదుర్కొని అజేయంగా నిలిచింది.

కాని కరోనా భారతదేశ స్థయిర్యాన్ని దెబ్బతీసింది. కోవిడ్ తో సతమతమవుతూ ఇపుడు అన్ని దేశాలనుంచి సాయం అందుకునే పరిస్థితి వచ్చింది.

బంగ్లాదేశ్-పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఇండియా కు సహాయం చేస్తాం అన్న పరిస్థితికి దేశం వచ్చింది.

ఈ రోజు అమెరికా యుద్ధవిమానం భారత్ కు కోవిడ్ సాయంతో బయలుదేరింది. ఈ విమానంలో 440 ఆక్జిజన్ సిలిండర్లు,  ఒక లక్ష  N9మాస్కులు, పదిలక్షల ర్యాపిడ్ డయాగ్నోష్టిక్ టెస్టుకిట్లతో పటు మరక 25 మిలియన డాలర్ల విలువచేసే ఇతర సామగ్రి ఉన్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *