భారత్ బయోటెక్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్న వ్యాక్సిన్ ధరని తగ్గించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కంపెనీ తయారుచేసే కోవాగ్జిన్ వ్యాగ్జిన్ ఒక డోస్ ధర ను రు. 600 నిర్ణయించింది.అయితే, ఈధర వివాదాస్పదం కావడం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడంతో వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ధరలను సవరిస్తున్నాయి.
ఇందులో భాగంగా నిన్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII), కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను రు.400 నుంచి రు. 300 తగ్గించింది.
ఇదే దారిలో భారత్ బయోటెక్ వెళ్లి వ్యాక్సిన్ ధరను రు. 200 తగ్గించింది.
ఇపుడు దేశంలో ఉన్న కోవిడ్ విపత్కర పరిస్థితిని, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టకుని రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్న కోవాగ్జిన్ ధరని డోసుకు రు. 400లకు తగ్గిస్తున్నట్లు కంపెనీ ఒకప్రకటన విడుదల చేసింది.
“ Recognizing the enormous challenges to the public health care system we have made COVAXIN available to state governments at a price of Rs400 /dose.”
సీరమ్ ఇన్ స్టిట్యూట్ గాని, భారత్ బయోటెక్ గాని ప్రయివేటు సంస్థలకుఅందించాలన్నధర (రు 1200 లకు ఒక డోసు) లను తగ్గించలేదు. తాను నిర్ణయించిన ధరలను ఇంతవరకు భారత్ బయోటెక్ సమర్థించుకుంటూ వచ్చింది.ప్రాడక్ట్ డెవెలప్ మెంట్, ప్రొడక్షన్,క్లినికల్ ట్రయల్స్ మీద పెట్టిన ఖర్చును తాము రాబట్టుకునేందుకు ఈ ధరలను నిర్ణయించామని చెబుతూ వచ్చింది.అంతర్జాతీయ మార్కెట్లో కోవాగ్జిన్ ధరని $15 నుంచి $20 డాలర్లదాకా నిర్ణయించవచ్చని సమాచారం.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/breaking/serum-institutes-slashes-vaccine-price-by-rs-100/