AP Covid Update: కొత్త కేసులు 14,792

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటలలో 14,792   కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో 86,035 మందికి పరీక్షలు నిర్వహిస్తే ఈ కేసులు బయటపడ్డాయి. అయితే,  కోవిడ్ వల్ల అనంతపురంలో ఏడురుగు, విజయనగరంలో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఏడుగురు,  తూర్పుగోదావరిలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు,విశాఖ జిల్లా ఐదుగురు, నెల్లూరు జిల్లాలో నలుగరు, శ్రీకాకుళంలో  నలుగురు,కడపలో ముగ్గరు,  కృష్ణలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గరు, కర్నూలు లో ఇద్దరు , గుంటూరు జిల్లాలో ఒక్కరు మృతిచెందారు.

జిల్లాలకు సంబంధించి అత్యధిక కేసులు చిత్తూరు జిల్లాలొ (1831) నమోదయ్యాయి. తర్వాత  శ్రీకాకుళం 1829  కేసులతో ద్వితీయ స్థానంలో ఉంది. గుంటూరు జిల్లా  నుంచి 1760 కేసులు,  తూర్పుగోదావరి నుంచి  1702 కేసులు, అనంతపురం జిల్లానుంచి 1538 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇంతవరకు  7928 మంది కోవిడ్ వల్ల మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *