ఎంతో ప్రతిష్టాత్మకంగా 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు ప్రజలందరికీ వ్యాక్సిన్ కోసం ఈరోజు ప్రారంభించిన రిజిస్ట్రేషన్ చాలా మందిని నిరాశకు గురి చేసింది. ఏప్రిల్ 28 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి ఆన్లైన్ ద్వారా రిజిస్టేషన్లు చేసుకోవాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే.
దీని కోసం ఎంతో మంది రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మక్కువ చూపారు. ఇదే సందర్భంలో బుధవారం మంగళగిరి పట్టణం నుండి అనేక మంది యువకులు వ్యాక్సిన్ కోసం తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ముందుకు వచ్చారు.
కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫోన్ నెంబరు తో లాగిన్ అయిన అనంతరం వ్యాక్సిన్ సెంటర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో అన్ని ఆసుపత్రులు 45 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ లు అందించే ఆసుపత్రులు జాబితా దర్శనమిస్తున్నదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు.
18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సిన్ అందించే సెంటర్ ల జాబితా గుంటూరు జిల్లా మొత్తంలో ఎక్కడా కనిపించలేదు.
దీంతో పలువురు యువకులు నిరాశకు గురయ్యారు.
దీనిబట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం 18నుండి44 సంవత్సరాల వారికి ఇప్పటిలో వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తుంది.