గ్రామాలు, పట్టణాల్లో కొవిడ్ బారిన పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వ స్కూల్స్, సంస్థల భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ ప్రకటించారు.
కరోనా సోకితే ఇంట్లోనే ఐసోలేషన్ కోసం తగినంత వసతి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ అవసరాన్ని దృష్టిలోపెట్టుకుని బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడాని ఆయన చెప్పారు.
కరీంనగర్ నగర వాసుల అసవరాలను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, సిరిసిల్ల, వేములవాడ లలో పీటీసీ ని ఐసోలేషన్ కోసం అందుబాటులోకి తెస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సూచించాను. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కుమార్ కోరారు.
కరీంనగర్ నగర వాసులకు కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, సిరిసిల్ల, వేములవాడ లలో పీటీసీ ని ఐసోలేషన్ కోసం అందుబాటులోకి తెస్తున్నాం.
ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సూచించాను. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.— B Vinod Kumar (@vinodboianpalli) April 28, 2021