ఆంధ్రలో రెమిడిసివర్ ఇంజక్షన్ కొరత లేదు…

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ  సెక్రటరీ అనిల్ సింఘాల్ అందిస్తున్న ఎపి కరోనా తాజా సమాచారం.

 

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 28,994 రెమిడెసివిర్ (Remdesivir) ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఇంజెక్షన్లకు కొరత లేదు.

గత 3 రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 13,864 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందించాం.  రెపిడెసివిర్ ఇంజక్షన్లు బయట తెచ్చుకోవాలని ప్రైవేట్ ఆస్పత్రులు అంటున్నాయంటే ఏదో తేడా ఉన్నట్లే.

దీనిని పరిశీలిస్తున్నాం.ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఫిర్యాదులపై ఆరా తీస్తున్నాం.

వచ్చే ప్రతి పేషంటుకు రెమిడెసివిర్ ఇంజెక్షన్ అవసరం లేకున్నా.. కొందరు ఇస్తున్నారు.

నిన్నటికి రాష్ట్రంలో కోవాగ్జీన్ 65240 డోసులు, కోవీషీల్డ్ 134440 డోసులు అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ గత 24 గంటల్లో 14,669 పాజిటివ్ కేసులునమోదయ్యాయి.  71 మరణాలు సంభవించాయి.

 

ఒకటి  రెండు  రోజుల్లో ట్రూనాట్ టెస్టులు చేపడతారు

రాష్ట్రంలో కోవిడ్ చికిత్స కోసం 422 ఆస్పత్రులకు అనుమతి

 రాష్ట్రంలో ఐసియు బెడ్ల కొరత లేదు. మొత్తొ  5,572 ఐసీయూ బెడ్లలో 2,570 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

 అత్యవసర స్థితిలో  7,744 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి

 ఇవి కాకుండా 7643 జనరల్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి

 బెడ్ల వివరాలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతారు.

ఆస్పత్రులకు అనుమతి లేకనో లేదా ప్రైవేట్ ఆస్పత్రులే బ్లాక్ చేశాయని భావించాలి

ఈసారి క్వారంటైన్ సెంటర్లు పెట్టడం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *