కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ లకు వేర్వేరు ధరలు నిర్ణయించడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
డ్రగ్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం, కోవిడ్-19 వ్యాక్సిన్ ధరలను నిర్ణయించడంతో కేంద్రానికి జోక్యం చేసుకునే అధికారం ఉందని కోర్టు పేర్కొంది.
ఇంత అత్యవసర పరిస్థితి వచ్చినపుడు కాకుంటే ఇంకెపుడు జోక్యం చేసుకుంటారు, అని కేంద్రాన్నిప్రశ్నించిం.
“When will the government exercise this right if not during an emergency,” అని జస్టిస్ చంద్రచూడ్, జస్టిన్ ఎల్ ఎన్ రావు, జస్టిస్ రవీంద్ర ఎస్ భట్ ల ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.
కంపెనీల ఇలా వేర్వేరుధరలను నిర్ణయిస్తుండటాన్ని కోర్టు ప్రత్యేకంగా పేర్కొంది.
ఏ పద్ధతి ప్రకారం వ్యాక్సిన్ ధరలను కంపెనీలు నిర్ణయిస్తున్నాయో కోర్టుకు ఒక అఫిడవిట్ ద్వారా తెలియచేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఏ చర్యలుతీసుకుంటున్నదో కూడా కోర్టు కు నివేదించాలని జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు.
ఇంత ఉపద్రవం ఎదురయినపుడు సుప్రీంకోర్టు ప్రేక్షక పాత్రవహిచంలేదు. సుప్రీంకోర్టు దోహదకారి పాత్ర పోషించాలి. ఏదైనా సస్య రాష్ట్రాల సరిహద్దులు దాటిపోతున్నపుడు సుప్రీంకోర్టు ఉరుకోలేదు. అక్కడే అర్టికల్ 32 అధికరణం ముందుకు వస్తుంది, అని కోర్టు పేర్కొంది.