తళుక్కున మెరిసి వైఎస్సార్ కూ షాకిచ్చిన  ఎమ్మెస్సార్

ఎం సత్యనారాయణ రాజకీయాలో ఎమ్ ఎస్ ఆర్ (MS or MSR) గా పాపులర్.  తనకంటూ ఒక వర్గమూ, ఢిల్లీలో గాడ్ ఫాదర్ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తళుక్కున మెరిసిన నాయకుల్లో ఎం ఎస్  ఒకరు.  14 సంవత్సరాలు ఎంపిగా ఉండి. వెలమకులానికి చెందినా, ఆయన  తెలంగాణలో  కాంగ్రెస్ ప్రాంతీయ నాయకుడు కాలేకపోయాడు.బహుశా ఇది తెలంగాణ  కాంగ్రెస్ నేతల్లో ఉన్న బలహీనతే మో. ఎందుకంటే, తెలంగాణాలో మర్రిచెన్నారెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక వర్గం ఉండి, అవసరమయిన హైకమాండ్ ను కూడా తనకు అనుకూలంగా మార్చుకోలగిన సత్తా ఉన్న నాయకుడెవరూ తయారు కాలేదు. తెలంగాణ నుంచి వచ్చిక కాంగ్రెస్ నేతలంతా హైకమాండ్ చెక్కిన శిల్పాలే. ఇందులో ఎం ఎస్ ఒకరు. ఆయనకు పార్టీలో   శిష్యులు  లేరు. సొంత జిల్లా కరీంనగర్ లో ఎమ్మెల్యేల మద్దతు కూడా లేరు.

ఇలాంటి ఎంఎస్  2000 సంవత్సరంలో అక్షరాల ఎంస్ ఆకాశం నుంచి ఉడిపడ్డట్లు పిసిసి అధ్యక్షుడయ్యారు.


ఎపిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మేనేని సత్యనారాయణరావు(87)  కొవిడ్‌ బారిన పడిన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.


అప్పటి దాకా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డియే సిఎల్ పి లీడర్. పిసిసి అధ్యక్షుడు. అయితే, 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడంతో రాజశేఖర్ రెడ్డికి రెండు పదవులుండరాదని, అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఒక చిన్న తిరుగుబాటు వచ్చింది. పి.జనార్దన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు లో వైఎస్ ఆర్ ని  పిసిసి పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. నిజానికి తొలినుంచి వాళ్లు, వైఎస్ ఆర్ రెండు పదవులను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఒక నాయకుడు పదవి అనే సూత్రం పాటించాలని వాళ్లు కోరుతూ వచ్చారు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయడు మళ్లీ గెలవడంతో ఈ డిమాండ్ వూపందుకుంది.2000 మార్చిలో మునిసిపల్  ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.  దీనితో హైకమాండ్ కూడా వైఎస్ ఆర్ ను సిఎల్పీలీడర్ గా కొనసాగించి, పిసిసి కి మరొక వ్యక్తిని ఎంపిక చేయాలనే యోచనలోపడిపోయింది. తననంటూ తొలగిస్తే తన వారుసుడిగా నియమించేందుకు వైఎస్ ఆర్ కొన్ని పేర్లు ఇచ్చారు. అందులో  డి శ్రీనివాస్ (బిసి, తెలంగాణ), టి.పురుషోత్తమరావు (వెలమ, తెలంగాణ),మాజీ ఎంపి ద్రోణంరాజు సత్యనారాయణ (బ్రాహ్మణ ఉత్తరాంధ్ర) లు ఉన్నారు. మరొక వైపు పి జనార్దన్ రెడ్డి, హనుమంతరావులు తమకే పిసిసి ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

వైఎస్ ఆర్  సిఫార్సు చేసిన వ్యక్తులెవరికీ పిసిసి పదవి దక్కకుండా మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గం  అన్ని విధాల ప్రయత్నిస్తూ ఉంది.  కోట్ల వర్గం  సంబాని చంద్రశేఖర్ (ఎస్ సి, తెలంగాణ), కె సత్యనారాయణ రాజు ( రాజు, ఆంధ్ర), ఎం కోదండరెడ్డి ( తెలంగాణ)ల పేర్లను ప్రతిపాదించింది.

తర్వత మాజీ రాష్ట్ర గవర్నర్ కుముద్ బెన్ జోషి సంస్థాగత ఎన్నికల ఇన్ చార్జ్ గా ఉన్నారు. ఆమె మర్రి శశిధర్ రెడ్డి పేరు ( మర్రి చెన్నారెడ్డి కుమారుడు)  పేరు ను సిఫార్స్ చేశారు.

ఇలాంటపు హైకమాండ్ పిసిసి అధ్యక్షుడిగా ఒక కొత్త పేరును తీసుకువచ్చింది. అది ఎం సత్యనారాయణరావు.

ఉన్నట్లుండి, కాంగ్రెస్ రాజకీయాల్లో  కనిపించడం మానేసిన వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా నియమించింది. నిజానికి ఆయన రాజకీయాలనుంచి రిటైరై 14 సంవత్సరాలయింది. ఎపుడో 1985 ఆయన కనిపించడం లేదు.  1971లో, 1977లో  1980లో ఆయన మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.  తర్వాత ఆయన కు 1998 దాకా ఆయన పార్టీ ఎపుడూ టికెట్ ఇవలేదు.  1998లోపోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు 1989లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అంటే 1984నుంచి ఆయన ఏ ఒక్క ఎలెక్షన్ గెలవలేదన్నమాట.

ఇలాంటి వ్యక్తిని  2000 మే నెలలో పిసిసి అధ్యక్షుడిగా నియమించడం వైఎస్ ఆర్ కు షాక్  ఇచ్చినట్లయింది. ఆయన ప్రత్యర్థి వర్గాలకు కూడా అంతే షాక్.  సత్యనారాయణ రావు మీద ఏ వర్గం ముద్రలేదు కాబట్టి  కొత్త పిసిసి అధ్యక్షుడితో కలసి పని చేసేందుకు తాను సిద్దమేనని, ఆయన నియమాకం సరైందేనని    వైఎస్ ఆర్  ప్రకటించారు.

ఇంతకీ ఎంఎస్ ఎలా పిసిసి అధ్యక్షుడయ్యారు. పార్టీరాజకీయాలకు దూరంగా ఉంటున్న వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా ఎవరు ప్రతిపాదించారు? అనే చర్చ సాగింది. వైఎస్ ఆర్ ను పిసిసి నుంచి తప్పించాలని ఉన్నా, హైకమాండ్ ఆయన మీద అపారనమ్మకంతో ఉంది.  అయితే,  పి జనార్దన్ రెడ్డిని నియమించడం హైకమాండ్ కు ఏమాత్రం ఇష్టం లేదు. వైఎస్ ఆర్, పిజెఆర్ మధ్య ఉన్న వైషమ్యాలు పార్టీని దెబ్బతీస్తాయి. వి. హనుమంతరావు కు అంత పెద్ద బాధ్యత అప్పగించేందుకు పార్టీ సముఖంగా లేదు. ఇక మిగిలిన పేర్లన్నంటికి నాయకుల ముద్రలున్నాయి.

ఇలాంటపుడు సత్యానారాయణ పేరు హైకమాండ్ పరిశీలనకు వచ్చింది. ఈ పేరునుమొదట ప్రతిపాదించిందెవరూ అనే ఇప్పటికీ తెలియదు. ఆయన ఏ వర్గానికి చెందని వ్యక్తి కాబట్టి తమ తమ ఖాతాల్లో వేసుకున్నారు.  ఆర్థికంగా బలమయిన కుటుంబం నుంచి వచ్చిన వాడు కాదుకాబట్టి, పార్టీ ని నడపాలంటే ఎవరిమీదో ఒకరి మీద ఆధారపడాలి. అదే జరిగింది. ఆ బాధ్యతను వైఎస్ ఆరే స్వీకరించారు. పిసిసి అధ్యక్షుడు ఎంఎస్ ఆర్, నడిపించింది వైఎస్ ఆర్ అని ఢిల్లీలో అనే వాళ్లు.

ముక్కూసూటి తనం ఎంఎస్ ఆర్ హాల్ మార్క్

ఎవరినీ లెక్కచేయకుండా మాట్లాడటం సత్యనారాయణ రావు స్వభావం. ఇలా మాట్టాడి ఆయన చాలా సార్లు వివాదం లేపారు. ఒక సారి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్య జాతి అని, ఆమకు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదన్నారు. విదేశీయురాలైన సోనియాగాంధీకి ప్రధాని అయ్యేందుకు అర్హత లేదని జయలలతి వ్యాఖ్యనించినపుడు ఎంఎస్ చేసిన కామెంట్ అంది. ‘జయలలిత రంగును బట్టి ఆమె ఆర్యజాతి చెందిన మనిషి. ఆర్యులు కూడా విదేశీయులే. ఆమెకు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు,’ అని ఆయన అన్నారు. అయితే, నాటి కాంగ్రెస్ ముఠారాజకీయ తగాదాల గురించి చాలా రహస్యాలు అయనకు తెలుసు.అపుడ.పుడు మీడియా వాళ్లతో ఇవి షేర్ చేసుకుని వార్తలకు మసాలా అందించే  వాడు.

2003 ఎంఎస్ ఆర్ రాజీనామా చేశారు. వైఎస్ ఆర్ తనకు ఇష్టుడయిన డిశ్రీనివాస్ ని పిసిసి అధ్యక్షుడి నియమించేలా చూసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *