ప్రధాని మీద విదేశాలలో వస్తున్న విమర్శలకు భారత్ ఆగ్రహం

ఇపుడు భారతదేశాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 రెండో తరంగానికి భారత ప్రధాని నరేంద్ర మోదీయే ప్రధాన కారణమని అంతర్జాతీయ వార్తా సంస్థులు రాస్తుండటం పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదట లండన్ నుంచి వెలువడుతున టైమ్స్ ప్రతిక ఒక వ్యాసం రాసింది. తర్వాత  ఆస్ట్రేలియా కు చెందిన ‘ది ఆస్ట్రేలియన్’ (The Australian) కూడా ప్రధాని మోదీ వైఫల్యం  అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించింది. ఈ సంస్థ పూర్తిగా టైమ్స్ రిపోర్టును తీసుకుని రాసింది.ఇదేఅచ్చేసేముందు భారత ప్రభుత్వ వాదన ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు.   ఈ వార్తా సంస్థ  Modi Leads India Into Viral Apocalypse అనే శీర్షికతో భారత్  లోని కరోనా పరిస్థితి మీద విమర్శనాత్మక వ్యాసం రాసింది. ఈ దోరణిని  భారత్ విమర్శించింది.  ఈ వ్యాసంలో ‘అహంకారం, మితిమీరిన జాతీయ వాదం, అసమర్థ పాలనాయంత్రాంగం అన్నీ కలసి ఈ మహోపదద్రవాన్ని సృష్టించాయని,  భారతదేశంలో ప్రజలు ఊపిరాడకచస్తుంటే ప్రధాని మోదీ భారీ ర్యాలీలలో జనాన్ని చూసి ఆనందిస్తున్నారని విమర్శకులంటున్నారు,’అని రాసింది.

“Arrogance, hyper-nationalism, and bureaucratic incompetence have combined to create a crisis of epic proportions, critics say, as India’s crowd-loving PM basks while citizens literally suffocate.”  ఇది తప్పంటు కాన్ బెర్రా లోని భారత దౌత్యకార్యాలయం ఈ సంస్థ ఎడిటర్ కులేఖ రాసింది.ఇది పూర్తిగా నిరాధారమని భారత్  పేర్కొంది. వ్యాసంలో లెవనెత్తిన అంశాలన్నింటికి సమాధానంరాస్తూ దీనిని కూడా ప్రచురించాలని కోరింది.

కోవిడ్ ను అరికట్టేందుకు భారతదేశం అనుసరిస్తున్న విధానానికి అంతర్జాతీయ ప్రశంసలందాయని చెబుతే ఈ వ్యాసం కేవలం భారతదేశం తీసుకుంటున్న చర్యలను, ముఖ్యంగా ఇపుడున్న సంక్షోభ సమయంలో, దెబ్బతీసేందుకే రాసినట్టుందని భారత్ పేర్కొంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *