ఎన్నికల కమిషన్ పై ఖూనీ కేసు పెట్టాలి :మద్రాస్ హైకోర్టు

తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరగి అక్కడ లాక్ డౌన్ పరిస్థితులు, కర్ఫ్యులు, ఇతర అంక్షలు అమలుజరగుతు ఉండటానికి ఎన్నికల కమిషన్ వైఫల్యానికి సంబంధం ఉందని మద్రాస్ హైకోర్టు  గుర్తించింది. సెకండ్ వేవ్ కరోనా కే ఎన్నికల కమిషనే కారణమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ రోజు  మద్రాసు హైకోర్టులో జరిగిన ఒక విచారణలో చీఫ్ జస్టిస్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు.

రాజకీయ పార్టీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించే  సమయాల్లో కొవిడ్ నిబంధనలుపాటించేలా చూడటంలో భారత ఎన్నికల కమిషన్ విఫలమయిందని , అందువల్లే సెకండ్ వేవ్ కోవిడ్  సంక్షోభం మొదలేందని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. దీనికి పూర్తి బాధ్యత భారత ఎన్నికల సంఘానిదే అంటూ ఎన్నికల కమిషన్ మీద  మర్డర్ కేసు పెట్టాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించిందని  livelaw.in  రిపోర్టు చేసింది.

“Your institute is singularly responsible for the second wave of Covid-19. Election Commission officers should be booked on murder charges probably,” అని చీఫ్ జస్టిస్ సానిజ్ బెనర్జీ నాయకత్వంలోని  హైకోర్టు బెంచ్  సంచలన వ్యాఖ్య చేసింది. బెంచ్ లో జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి రెండో సభ్యుడు.

ఎన్నిలక ప్రచారం సమయంలో కోవిడ్ ప్రొటొకోల్ అమలు కాకపోవడం పట్ల బెంచ్ ఎన్నికల కమిషన్ ప్రతినిధుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది

“Were you on another planet when the elections rallies were held,”అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారని లైవ్ లా రిపోర్టు చేసింది.

ఓట్ల లెక్కింపుజరిగే  మే 2 వ తేదీన  కోవిడ్ ప్రొటో కోల్ ను అమలు చేసేందుకు ఖచ్చిన చర్యలను  ఎలా తీసుకోబోతున్నారో ఒక బ్లూ ప్రింట్ సమర్పించాలని, అలా కాని పక్షంలో కౌంటింగ్ నిలిపివేస్తామని కూడా కోర్టు హెచ్చరించింది. ఏప్రిల్ 30 నాటికి బ్లూ ప్రింట్ సమర్పించాలనిచెబుతూకేసును ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.

“Public health is of paramount importance and it is distressing that constitutional authorities have to be reminded in such regard. It is only when a citizen survives that he will be able to enjoy the rights that a democratic republic guarantees,” అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

బతికి బట్టకట్టడమే ఇపుడున్న పరిస్థితి.  మిగతా విషయాన్నీ తర్వాతే. (The situation now is of survival and protection. Everything else comes next) అని ఆయన అన్నారు.

తమిళనాడుఆరోగ్యశాఖ కార్యదర్శితో సంప్రదించి  కోవిడ్ ప్రొటోకోల్ ను ఎలా అమలుచేయాలో బ్లూ ప్రింట్ రూపొందించాలని బెంచ్ తమిళనాడు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ను ఆదేశించింది.

 

One thought on “ఎన్నికల కమిషన్ పై ఖూనీ కేసు పెట్టాలి :మద్రాస్ హైకోర్టు

  1. వందేమాతరం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా బెంగాల్ లొ ప్రసారాలు ఉధృతంగా జరుగుతూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *