సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్య తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఎపుడూ ప్రజల్లోనే కనిపిస్తుంటారు. ఆయన కార్యాలయం కూడా ఎపుడూ విజిటర్లకు అండగా ఉంటుంది. జగ్గారెడ్డి ఆఫీసుకు వెళ్లే వాళ్లు నిరుత్సాహంతో తిరిగారరని లోకల్ లో చెపుతుంటారు. ఏదైనా లీగల్ గా కష్టమొస్తే, మెుండిగా దానిని టాకిల్ చేయడం జగ్గారెడ్డికి బాగా తెలుసు. అందుకే సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని పర్యాయపదం. ఇపుడు జగ్గారెడ్డి కరోనా పేషంట్లకు బాసటగా నిలబడుతున్నాడు. నేనున్నాను మీరు పరీక్షలు చేయించుకోండి, కరోనాలు నియమాలు పాటించండి, అవసరమయితే ఆసుపత్రిలో చేరండి, కరోనా వ్యాప్తి నివారించండని ఆయన క్యాంపెయిన మొదలుపెట్టారు.
అంతేకాదు, ఆసుపత్రికి వెళ్లేముందు తన కార్యాయలానికి ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మీ కేసు ఫాలో చేస్తానని ప్రకటించారు. ఆయన కార్యాలయం ఫోన్ నెంబర్ 08455-278355.
జగ్గారెడ్డి ప్రజలు చేస్తున్న విజ్ఞప్తి ఇదే…
* కరోనా తో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా సిటీ (CT) స్కాన్ , X-RAY తీయించుకోవాలి..
* జ్వరం ,దగ్గు,జలుబు,ఇతర లక్షణాలు ఉన్నవారు కేవలం మందులు వాడి ఉరుకుంటున్నారు..
* అది తప్పు. దీంతో వారిలో ఉన్న ఇన్ఫెక్షన్ తెలియకుండా ప్తుంది. మరోసారి కరోనా వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది..
*ఇటీవలే వస్తున్న కరోనా కేసు లను గ్రహించి,డాక్టర్స్ తో చర్చించాను..వైద్యులు ఇచ్చిన సలహా మేరకే నేను సలహా ఇస్తున్న
* 5 వేల కోసం చూసుకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ప్రజలు ఇది గమనించాలి..
* సంగారెడ్డి నియెజకవర్గ ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ కి కూడా వెళ్ళాలి..
* అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కేటీఆర్ ని సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో సిటీ స్కాన్ పాడయిందని కొత్తది కావాలని కోరడం జరిగింది..
* త్వరగా ఆర్డర్ ఇచ్చి సిటీ స్కాన్ తెప్పిస్తామని మంత్రులు ఈటెల రాజేందర్,కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల సమయంలో నాకు మాట ఇచ్చారు..
* ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ తో మాట్లాడడం జరిగింది…
* కొత్త సిటీ స్కాన్ రావడానికి ఒక నెల సమయం పడుతుందని అప్పటివరకు బయట చేయిచుకోవాలన్నారు.
* అలాగే హాస్పిటల్ లో సుమారు 150 బెడ్స్ ఉన్నాయని,ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు..
* వచ్చే నెలలో సిటీ స్కాన్ కూడా వస్తుందన్నారు..
* దయచేసి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ లో బెడ్స్ కోసం ఎదురుచూసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అప్పటివరకు మన ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం చేయించుకోవాలి..
*సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్ళేవారు కూడా నా ఆఫీస్ నెంబర్ 278355 కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి నేను ఫాలో అప్ చేస్తాను
* కరోనా లక్షణాలతో 5 రోజులో బాధపడుతున్న వారు తప్పకుండా సిటీ స్కాన్, x-ray చేయించుకోవాలి..
Rare politician in these times of farmhouse politics. Kudos Jaggareddy garu 🎉