కరోనా కేసులు విపరతంగా పెరిగిపోతుండటంతో ఆంధప్రదేశ్ ప్రభుత్వం కూడా నైట్ కర్ఫ్యూ బాట పట్టింది.రేపటి నుంచి నైట్ కర్ఫూ అమలులోకి వస్తుంది. ఇది రాత్రి 10 నుంచి ఉదయం 5 దాకా అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మే 1 వ తేదీ నుంచి ఉచిత వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలవుతుంది.
ఇలాగే మరొక శుభవార్త కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తారు. 18 సంవత్సరాలుపైబడిన వారందరికి వ్యాక్సిన్ వేయించుకునేందుకు అనుమతిస్తూ కరోనా వ్యాక్సినేషన్ ని లిబరలైజ్ చేయడంతో వ్యాక్సిన ధర పెరిగింది.
కోవి షీల్డ్ వ్యాక్సిన్ అందిస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ డో స్ ధరను ప్రయివేటు రంగంలో రు. 600లకు, ప్రభుత్వాలకు రు. 400లకు ఇవ్వాలనిర్ణయించింది. ఇది చాలా మందికి భారమే. ఇలాంటపుడు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని నిర్ణయించింది. దీనికి రు. 1600 కోట్లు ఖర్చువుతాయని అంచనా.