వ్యాక్సినేషన్ లో భారత దేశం వెనకబడింది. ప్రజలకు వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురావడంలో చాలాదేశాలు భారత్ కంటే ముందున్నాయి.
దీనికి కారణం, భారత్ లో కేవలం రెండు సంస్థలకే వ్యాక్సిన్ తయారు చేసేందుకు లైసెన్స్ ఇవ్వడమనే విమర్శ ఉంది. ఇపుడు భారత్ లో భారత్ బయోటెక్, సీరమ్ ఇన్ స్టిట్యూట్ కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి.
రష్యా స్పూత్నిక్ 5 వంటి మరికొన్ని వ్యాక్సిన్ లకు అనుమతినిచ్చేందుకు వెనకాడుతూ వచ్చింది. అందుకే ఈ మధ్య కాలంలో మరొక మూడో వ్యాక్సిన భారత్లో అందుబాటులోకి రాలేదు.
మరొక కంపెనీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం, లైసెన్స్ ఉన్న రెండు కంపెనీలు డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోవడంతో దేశంలో వ్యాక్సిన్ కొతర తీవ్రమయింది. దీనితో అనేక రాష్ట్రాలు చాలా వ్యాక్సినేషన్ సెంటర్లను మూసేయాల్సి వచ్చింది.
బయట ప్రపంచంలో చాలా దేశాలు తమ వ్యాక్సిన్ అందించడంలో బాగా ముందుకు పోయాయి. ఉదాహరణకు ఏప్రిల్ 17 నాటికి ఇంగ్లండులో 48.2 శాతం మందికి వ్యాక్సిన్ అందింది. అమెరికా లో 38.2 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. జర్మనీలో 18.9 మందికి వ్యాక్సిన్ అందింది. భారతదేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారు కేవలం 7.7 శాతమే.
ఏప్రిల్ 11 నుంచి 14 దాకా టీకా ఉత్సవ్ జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా, ఆ నాలుగు రోజుల్లో అంతకు ముందు నెలలోకంటే తక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్ జరిగింది.
ఇపుడు 18 సంవత్సరాల పైబడిన వారందరికి వ్యాక్సిన్ అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్ మీద ఉన్న అంక్షలు ఎత్తేసి, లిబరలైజ్ చేసినందున, ధరలరుపెరిగే అవకాశమున్నా ప్రభుత్వనిర్ణయానికి బాగా స్పందన వచ్చింది. మరి వ్యాక్సిన్ కొరత తీరుతుందా?