తెలంగాణలో సినిమా థియేటర్లు మూత, వకీల్ సాబ్ కు మినహాయింపు!

కరోనా వ్యాప్తితీవ్రత దృష్ట్యా తెలంగాణలో  రాత్రి కర్ఫ్యూ అమలులోకి రావడంతో  సినిమా థియేటర్లను రేపటి నుంచి మూసేస్తుననారు.

రోజు రోజుకు   కరోనా కేసులు పెరుగుతూ ఉంటం, రాష్ట్రమంతా రాత్రి కర్ప్యూ విధించిన సంగతి తెలిసిందే.

ఈ కారణాన సినిమా ధియేటర్ల నిర్వహణ గురించి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు అత్యవరంగా  సమావేశం జరిపారు పరిస్థితిని సమీక్షించారు.

కర్ఫ్యూ కారణంగా మార్కట్  గంటలకే మూసేస్తున్నందున, పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ను నిషేధిస్తున్నందున  రేపటి నుంచి థియేటర్లు మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

అయితే వకీల్‌సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లకు మాత్రం మూసివేత నుంచి మినహాయించినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు. ఇదెలా సాధ్యమో వివరాలు అందాల్సి ఉంది. కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ ఉత్తర్వులు

మరొక వైపు సినిమాల ప్రదర్శనల మీద ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం కూడా జివొ విడుదల చేసింది.

రాత్రిపూట విధించిన కర్ఫ్యూ అమలులో భాగంగా రాష్టంలోని అన్ని సినిమా ధియేటర్లు  20-4-21 నుండి 30-4-21 వరకు రాత్రి 8-00 గంటలకే మూసివేయాలి. మిగతా  వేళ్లలో పనిచేసినా  కోవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సినిమా థియేటర్ యాజమాన్యాలకు సూచనలు చేశారు.

ప్రభుత్వం సినిమా హాళ్ల నిర్వహణకు కొన్ని నియమాలు విధించింది.

  1. అన్ని హాళ్లలలో సిబ్బంది, ప్రేక్షకులు, అంగళ్ల నిర్వాహకులు విధిగా మాస్క్ ధరించాలి
  2. సినిమా ప్రవేశ ద్వారం వద్ద, కామన్ ఏరియాలో హ్యాండ్ శానిటైజర్లు ఉంచాలి
  3. సినిమా హాళ్లలో భౌతిక దూరం పాటించాలి. గుంపులు లేకుండాచూడాలి
  4. ఎయిర్ కండిషన్ లను  24 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్యనే పనిచేయించాలి.
  5. ధియోటర్ కాంప్లెక్స్ లలో ఒకేసరి అన్ని ధియోటర్లు ఇంటర్వల్ లేకుండా చూడాలని జివొలో పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *