దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ రాత్రి 8.45కు మాట్లాడనున్నారు. దేశంలో కరోనా కేసులుపెరుగుతూ ఉండటం, అనేక రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉండటంతో దేశం ముందున్న సవాళ్ల గురించి మోదీ ఏం మాట్లాడబోతున్నారు.
ఇక ముందు లాక్ డౌన్ ఉండదని ప్రధాని స్పష్టం చేసినా అనేక రాష్ట్రాలనుంచి వలస కార్మిలు తమ తమ వూర్లకు బయలుదేరుతున్నారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. చాలా చోట్ల ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండటం లేదు. దానికి తోడు కోవిడ్ వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.
అంటే మార్కెట్ ధరను పార దర్శకంగా నిర్ణియించుకుని, అమ్ముకోమని కేంద్రం కంపెనీలకు చెప్పింది. అదేవ్యాక్సిన్ ని కేంద్రం సరఫరా చేయదని, రాష్ట్రాలే బేరాలాడి కంపెనీలనుంచి కొనాలని చెప్పింది. 50 శాతం వ్యాక్సిన్ ని ఇలా రాష్ట్రాలకేటాయించి, మరొక 50 శాతాన్ని వైద్యసంస్థలకు, ప్రయివేటు కంపెనీలకే అమ్ముకోవచ్చని చెప్పింది. దీనితో ధరలు పెరుగుతాయని సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.
18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వవచ్చని శుభవార్త చెప్పిన ధరలు పెరుగుతాయనే మెలిక అందరిని ఆందోళనకకు గురిచేస్తున్నది.
ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌ను వేగంగా అందించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై మోదీ ఇవాళ సమీక్షించారు. దీంతో ప్రధాని మోదీ ప్రసంగంపై కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.