వెంటనే కఠినంగా కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకొనకపోతే, ఉత్తర భారతదేశంలోని ప్రతిరాష్ట్రం నుంచి సగటున రోజుకు లక్ష కరోనా కేసులు బయటపడతాయి.
ఈ లెక్క వింటే భయమవుతుంది. అయితే, ఇది చాలా బిగపట్టుకుని లెక్కించిన విషయం. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) నిపుణుడు డాక్టర్ గిరిధర్ బాబు లెక్క ఇది.
తొందరగా కరోనా వ్యాప్తి అరికట్టకపోతే, ఉత్తర భారతంలోని అనేక రాష్ట్రాలలో రోజులు లక్ష కరోనా కేసులు బయటపడే ముప్పుందని ఆయన హెచ్చరిస్తున్నారు. వైద్య సదుపాయాలు అంతంతగానే ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్,ఛత్తీష్ గడ్ ,పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలలో ఇలాంటి ప్రమాదముందని రీడిఫ్ న్యూస్ కు ఆయన చెప్పారు.
ఒక రోజులో లక్షల కేసులు ఎలా పెల్లుబుకుతాయి?
“ ఏప్రిల్ 16న ప్రభుత్వ ప్రకటించిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో 20,000 కోవిడ్ కేసులున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో జనసాంధ్రత ఎక్కువ. ఒక లెక్క ప్రకారం ప్రతి కోవిడ్ కేసు రోజులో కనీసం ముగ్గురికి కరోనా సోకిస్తాడు.
ఈ లెక్కన ఆ రాష్ట్రంలో 20 వేల కేసులు 60 వేలు అవుతాయి.వాళ్లు మరొక మరొక ముగ్గురికి కరొనా సోకిస్తే, మొత్తం కేసులు 180,000 అవుతాయి. హీనమంటే లక్షకు తగ్గవు.
అక్కడ ఉన్న ఎక్కువ జనసాంధ్రతలో కరోనా వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ వ్యాప్తిని అరికట్టకపోతే, ఉత్తర భారతదేశంలోని 12 రాష్ట్రాలలో కోవిడ్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఈ కేసులు తగ్గాలంటే కఠినంగా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలి.
అయితే, ఈ కేసులన్నీచాలా వరకు రోగలక్షణాలు చూపించవు. అందువల్ల చాలా మటుకు ఆసుపత్రిలో చేర్పించాల్సిన అసవరం ఉండదు. కరోనా సోకిన వారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఆసుపత్రి చికిత్స అవసరంఅవుతుంది. వీళ్లో కోసమే ఆసుప్రతులలో అత్యవసర చికిత్స ఏర్పాట్లను పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది,” అని డాక్టర్ గిరిధర్ బాబు అన్నారు.
ఒక కరోనా సోకిన వ్యక్తి ఎంతమందికి కి వైరస్ ను అంటించగలడు?
ఒక కరోనా వైరస్ ప్రత్యుత్పత్తి (సంతతి పెంచుకోవడం) సంఖ్యని RO (R naught)గా చూపిస్తారు. RO (R0) అనేది మ్యాధెమ్యాటికల్ నంబర్. దీనిని రిప్రొడక్షన్ నెంబర్ అని కూడా పిలుస్తారు. (R Naught is an estimate of how many healthy people one contagious person will infect)
ఈ సూత్రం RO=2 అంటే ఇన్ ఫెక్షన్ సోకిన ఒక వ్యక్తి సగటున రెండు ఇద్దరికి అంటించే దశ. ఈ దశలో కరోనా అంటించుకున్న ఆ యిద్దరు తర్వాత నలురుగరికి కి అంటిస్తారు. ఆ నలుగురు ఎనిమిది మందికి అంటిస్తారు. ఇది డబ్లింగ్.
(An RO of 2 suggests a single infection will , on average, become two, then four, then eight)
వైరస్ వ్యాప్తి ని అరికట్టేవరకు లేదా వైరస్ నిర్వర్యీమయ్యే వరకు ఈ డబ్లింగ్ ఇలా పెరుగుతూనే ఉంటుంది. అయితే, వ్యాక్సిన్ వాడినా,లేదా మనిషిలో సహజ రోగ నిరోధక శక్తి పెరిగినా, లేదా నివారణ చర్యలు తీసుకున్నా ఇలా డబ్లింగ్ అయిపోతూ ఉండటం జరగదు. అందువల్ల వైరస్ పెట్టే పిల్లల సంఖ్య (ఎఫెక్టివ్ రిప్రొడక్టివ్ నెంబర్) ఎపుడూ తక్కువగానే ఉంటుంది. కొంచెం ఊరట
మొదట్లో కొత్త గా కరోనా వైరస్ దాడి చేసినపుడు దానికి పట్టపగ్గాల్లేవు.. ఎందుకంటే, దాని ఉధృతి తగ్గించడానికి మనదగ్గిర మందుల్లేవు వైరస్ లేదు. అందరికి వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉండింది. అపుడు RO 1.5 నుంచి 3.5 దాకా ఉండిందని లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన ఎంఆర్ సి సెంటర్ ఫర్ గ్లోబల్ ఇన్ ఫెక్సిక్షియస్ డిసీజెస్ ఎనాలిస్ లెక్క కట్టింది.
ఇపుడు భారతదేశంలో కూడా RO 2 నుంచి 3 దాకా ఉందంటున్నారు. సగటున ప్రతికోవిడ్ సోకిన వ్యక్తి కనీసం 2.6 మందికి కోవిడ్ సోకించే ముప్పు ఉందని చెబుతున్నారు. అందువల్ల కోవిడ్ అదుపులోకి రావాలంటే కరోనా వ్యాప్తిని కనీసం 60 శాతం దాకా తగ్గించాలి ఈ సంస్థ నిపుణులు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. తగ్గించడం ఎలా? భౌతిక దూరం పాటించాలి. మాస్క్ ధరించాలి. బయటకు తిరగడం తగ్గించి కరోనా కు మరొక వ్యక్తి ఎదురు కాకుండా చూడాలి. వ్యాక్సిన్ వాడాలి.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/breaking/dr-jatinkumar-clarifies-basic-doubts-about-coronavirus-coovid-vaccine/