రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ -5 కు ఇండియా అనుమతి

రష్య న్ వ్యాక్సిన్ స్పుత్నిక్ -5 కు ఇండియా అనుమత

రష్యా తయారు చేసిన కోవిడ్-18 వ్యాక్సిన్ స్పుత్నిక్ 5 (Sputnik V) ను అత్యవపర పరిస్థితులలో ప్రయోగించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. భారత దేశ సబ్సక్ట్ ఎక్ప్ పర్ట్ కమిటీ సోమవారం నాడు ఈ అనుమతి నిచ్చింది.
భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉన్న సమయంలో, అందునా రోజు లక్ష మించి కరోనా కేసులు కనిపిస్తున్న సమయంలో స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ కు అనుమతి లభించిం. గత 24 గంటలో దేశంలో లక్ష కుమంచి పాజిటివ్ కేసులు కనిపించాయి. ఇలా లక్షకు మంది కేసులుకనిపించడం వరుసగా ఇది ఆరో రోజు. పాజిటివ్ కేసులకు సంబంధించి భారత్ దేశంలో ఇపుడు రెండోస్థానంలో ఉంది. మొదటి స్థానం బ్రెజిల్ ది.
ఏప్రిల్ ఒకటో తేదీన CDSCO కు చెందిన సబ్జక్టు ఎక్స్ పర్ట్ కమిటీ స్పుత్నిక్ వ్యాక్సిన్ గురించి అదనపు సమాచారం కోరింది. స్పుత్నిక్ వాడినందునఎదరుయిన సీరియస్ దుష్ఫలితాలల సమాచారం, RT-PCR కోవిడ్ పాజిటివ్ కేసులు సమాచారంతో మొత్తం ఆరు రకాల సమాచారాన్ని కోరారు. ఇది అందడతంతో ఇపుడు అత్యవసర అనుమతి నిచ్చారు. భారతదేశంలో ఈ వ్యాక్సిన్ హైదరాబాద్ కు చెందిన రెడ్డి ల్యాబోరేటరీస్ సంస్థ తయారు చేయాలనుకుంటున్నది. దేశంలో 100 మిలియన్ డోస్ లను తయారు చేసి పంపిణీ చేసేందుకు గత ఏడాదే రెడ్డి ల్యాబొరేటరీస్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *