అవునునిజం. మొన్న మొన్నటి దాకా బిఎస్ ఎన్ ఎల్ టెలిఫోన్ ఎక్చేంజిలో నైట్ వాచ్ మన్ గా పనిచేసిన రంజిత్ రామచంద్రన్ ఇక ముందు IIM-రాంచిలో ఆర్థిక శాస్త్రంలో పాఠాలుచెబుతాడు. రంజిత్ రామచంద్రన్ కేరళ కాసర్ గోడ్స సమీపాన ఉన్న పణత్తూర్ (Panathur) టెలిఫోన్ ఎక్చేంజిలో నైట్ వాచ్ మన్. ఆయన ఆయన ఒక పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చాడు. పణత్తూరులోని నుంచి రాంచి ఐఐఎం దాకా ఆయన సాగించిన యాత్ర నిండా కష్టాలు, నష్టాలు ఉన్నా చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. చిత్రమేమిటంటే, గిరిజన కుటుంబం నుంచి వచ్చినా రిజర్వేషన్ ను ఉపయోగించుకునే అవకాశం ఆయనకెపుడూ రాలేదు. అంటే ప్రతి మెట్టులో ఆయన జనరల్ కోటా నుంచి ఎంపికవుతూ వచ్చారు.
I was born in this house, I grew up here, now I live here…… Let me say happily that an IIM (Indian Institute of Management) Assistant Professor has been born in this house…… I felt like telling my story from this house to IIM Ranchi….. This story If I become fertilizer for someone’s dreams, that is my success….
The distance from this hut (heaven) to the assistant professor of IIM Ranchi was of hardship, the total amount of my dreams, the endurance of a father and mother
.పణత్తూరులో ఒక గడిసెలో వాళ్ల కుటుంబం నివసిస్తూ వచ్చింది. వాళ్లది అయిదుగురుసభ్యులున్న కుటుంబం. తండ్రి టైలర్. తల్లి కరువు పనుల(MNREGA) కూలి. అందువల్ల వాళ్లకున్న ఇద్దరు పిల్లలను చదివించడం చాలా కష్టమయ్యింది. అందుకే చాలాసార్లు స్కూల్లు దశలోనే చదువుమానేయాల్సి వచ్చింది. అయితే, ఆయనెపుడూ చదువు పూర్తి వదిలేయాలనుకోలేదు. అందుకే కష్టపడి చదవి మొత్తానికి స్కూల్ ఫైనల్ పూర్తి చేశారు.
అదృష్ట వశాత్తు చాలా పెద్ద జీతానికి ఆయనకు వెంటనే స్థానిక టెలిఫోన్ ఎక్చేంజ్ లో నైట్ వాచ్ మన్ ఉద్యోగం దొరికింది. నేలకు జీతం రు. 4000 వేలు. ఇది దొరకడం కుటుంబానికి కొండత అండ దొరికినట్లయింది. తర్వాత మెల్లిగా ఇంటర్ పూర్తయింది. వాళ్ల వూరి పక్కనే రాజాపురంలోని పియప్ టెన్త్ కాలేజ్ లో బిఎ ఎకనమిక్స్ లో సీటు సంపాదించాడు.
పగలు కాలేజీకి వెళ్లే వాడు, రాత్రి వాచ్ మన్ ఉద్యోగం చేసేశాడు. తర్వాత ఆయన కాసర్ గోడ్ సెంట్రల్ యూనివర్శిటీటో ఎమ్మె సీటు సంపాదించాడు. అయితే కాలేజీ కాలంలో నైట్ వాచ్ మన్ రూం ఒక స్టడీ సెంటర్ గామార్చుకున్నాడు. రోజూ పగలు ఇంట్లోభోజనం చేయడం, కాలేజీకి పరిగెత్తడం, రాత్రి మళ్లీ ఇంటికొచ్చి భోజనం చేయడం, డ్యూటీకి పరిగెత్తడం. ఆయినా సరే, ఆయన చదువు విజయవంతంగాసాగింది. ఎమ్మే పూర్తయింది. తర్వాత మద్రాస్ ఐఐటిలో జెఆర్ ఎఫ్ తో పిహెచ్ డి చేసేందుకు చాన్స్ గొట్టాడు. అలా మద్రాసు ఐఐటి నుంచి ఆయన పిహెచ్ డిపూర్తి చేశారు.
ఆయనకు మలయాళం తప్ప మరొక భాషరాదు.ఇంగ్లీష్ రాకా ఒక దశలో పిహెచ్ డి మానేద్దామనుకున్నాడు. అయితే, ఆయన గురువు ఫ్రొఫెసర్ సుభాష్ ధైర్యం నూరిపోశాడు. భాష రాదని మధ్యలోనే పారిపోవడం ఎంత తెలివి తక్కువ పనో ఆయన చెప్పవాడు. ముందుకు సాగుమన్నాడు. దీనితో ఆయన ఐఐఎంలో టీచింగ్ చేయాలని కలలు కనడం మొదలుపెట్టాడు. తనకు వస్తున్న ఫెలో షిప్ నుంచి కొత్త మొత్తాన్ని ఇంటికి పంపి తమ్ముడు రాహుల్ ని చదువు కు సహకరించాడు.
పిహెచ్ డి అయిపోయాక బెంగుళూరులోని క్రిస్ట్ కాలేజీలో రెన్నెళ్లు లెక్చరర్ గా పనిచేశాడు. తర్వాత ఇపుడు ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించాడు. నాజీవితమంతా పోరాటంగా సాగింది. అందుకే నాలాంటి ఆర్థిక నేపథ్యంలో ఉన్న నాజీవితం నుంచి స్ఫూర్తి పొందాలని నేను కోరుకుంటున్నానని అయన చెబుతున్నారు.
ఐఐఎంలో తాను అస్టిస్టెంట్ ప్రొఫెసర్ అయిన విధాన్ని ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తన గుడిసె ఇంటి ఫోటో An IIM Professor was born here అని శీర్షిక పెట్టి పోస్టు చేశారు. దీనికి 37,000లైక్స్ వచ్చాయి. ఈ పోస్టు విపరీతంగా వైరలయింది.
“I never thought the post would go viral. I posted my life story, hoping that it would inspire a few others. I want everyone to dream good and fight for their dreams,”అని ఆయన మీడియా కుచెప్పాడు.
Ranjith R Panathur పేరుతో ఆయనకు ఫేస్ బుక్ పేజీ ఉంది.