బాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్ మళ్ళీ గల్లంతు!

బాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్ మళ్ళీ గల్లంతు!
2021 లో బాలీవుడ్ తిరిగి పుంజుకున్నట్టు అన్పించింది.  కొత్త సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి. షూటింగులు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం కోవిడ్ కొరణంగా విడుదదలలు వాయిదా పడ్డ సినిమాల కొత్త విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఇంతలో కోవిడ్ తిరగబెట్టింది. ఉధృతంగా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో మహారాష్ట్రలో  థియేటర్లు ఏప్రిల్ 30 వరకు మూతబడ్డాయి. దీని ఫలితంగా నిర్మాతలు తమ విడుదలల గురించి మళ్ళీ పునరాలోచనలో పడాల్సి వచ్చింది.

        అప్పటికే విడుదల ఆలస్యయిన అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీని టాప్ దర్శకుడు రోహిత్ శెట్టి మళ్ళీ వాయిదా వేశారు. విడుదలకి సిద్ధమైన ఇతర బిగ్ మూవీస్ మాటేమిటి. ఏప్రిల్‌లో విడుదలలు ఆగిపోయిన బంటీ ఔర్ బాబ్లీ, తలైవి, రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్, సత్యమేవ జయతే 2, ఫ్లైట్, ఆర్ రెహమాన్ 99 పాటలు, గుల్శన్ గ్రోవర్ నటించిన ఇండో-పోలిష్చి త్రం నో మీన్స్ నో  ఎప్పుడు విడుదలవుతాయి? రానా దగ్గుబాటి హాతీ మేరే సాథీ  తమిళ తెలుగు వెర్షన్లు  కాదన్ మ ఆరణ్య మార్చి 26  న థియేటర్లలోకి వచ్చాయి. హిందీ వెరహన్ ఆగిపోయింది.   అమితాబ్ బచ్చన్ నటించిన చెహ్రే థియేట్రికల్ విడుదలను నిర్మాత ఆనంద్ పండిట్ కూడా వాయిదా వేశారు. జూన్ తర్వాత మాత్రమే ఆగిపోయిన సినిమాలు విడుదల అవుతాయని తాను  ఖచ్చితంగా అనుకుంటున్నానని ఆయనన్నారు.

 

   ఇటు సౌత్ రిలీజెస్ ఇప్పటివరకు ఒక ట్రాక్‌లో ఉండగాహిందీ సినిమాల తేదీలు మారిపోతున్నాయి. సూర్యవంశీకి ఇప్పుడు కొత్త విడుదల తేదీని నిర్ణయించాలంటే మాటలు కాదు. థియేటర్లు ఎప్పుడు తిరిగి తెరుస్తారో తెలియదు. ఆ స్పష్టత వచ్చిన తర్వాతే రీ షెడ్యూల్ మొత్తం జరిగే అవకాశముంటుంది. 

కోవిడ్ కుదిపేస్తున్న మహారాష్ట్రని మినహాయించి ఇతర రాష్ట్రాల్లో బిగ్ మూవీస్ ని విడుదల చేయడానికి మేకర్స్ పూనుకునే అవకాశాలు చాలా తక్కువ. ఆలిండియా బాక్సాఫీసులో 30-35 శాతం మహారాష్ట్ర వాటా వుంటుంది. కనుక దీన్ని వదులుకుని ఇతర రాష్ట్రాల్లో బిగ్ మూవీస్ రిలీజ్ చేసే అవకాశం లేదు. మహారాష్ట్ర లో థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో తిరిగి తెరిచినప్పుడు కూడా బిగ్ మూవీస్ విడుదల చేయలేదు. చిన్న సినిమాలే విడుదలయ్యాయి.

ఈ రీత్యా ఏప్రిల్ లేదా మే మొదట్లో విడుదలయ్యే సినిమాల ప్రణాళికలను మార్చుకోక తప్పడం లేదు. బాలీవుడ్ బిగ్గీసే కాదు, హాలీవుడ్ సినిమాల తేదీలను మార్చుకోక తప్పడం లేదు. థియేటర్లు తిరిగి తెరవడానికి ఇక వేచి ఉండలేని నిర్మాతలు బదులుగా ఓటీటీ విడుదలల్ని ఎంచుకుంటారా అనే ప్రశ్న వుంది. విడుదలను ఆలస్యం చేయడానికి పెరుగుతున్న ఖర్చుల విషయం ప్రధానంగా వుంది. వడ్డీలు తడిసి మోపెడవుతాయి. అయినా బిగ్గీస్ ఓటీటీ కి వెళ్లే అవకాశం లేదు. సూర్యవంశీ వంటి బిగ్గీస్ కి ఓటీటీ రెవెన్యూ చాలదు. మే 1 న సినిమా థియేటర్లు తిరిగి తెరుస్తాని నమ్మకం ఏమీ లేదు. కోవిడ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతూంటే సమీపకాలంలో థియేటర్లు తెరిచేమాట కల్ల. ముంబాయిలో రోజూ పదుల వేల సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారిన పడుతూంటే, వారు థియేటర్లు తెరిచాక సినిమాల కొస్తారా అన్నది ఆందోళన కల్గిస్తున్న ప్రశ్న!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *