ఏప్రిల్ 8 ‘చలో నంద్యాల’ కార్యక్రమం వాయిదా
నంద్యాల చారిత్రిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అభివృద్ధితో ముడిపడిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిరక్షణకు “చలో నంద్యాల” కార్యక్రమం ఏప్రిల్ 8, 2021 నిర్వహించడానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి సమాయత్తం అయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని వాయిదావేసినట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఏప్రిల్ 8, 2021 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో “ఏప్రిల్ 8 న జరుగనున్న ఛలో నంద్యాల” కార్యక్రమంను వాయిదా వేయాలని చాలా మంది సూచించారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిరక్షణకు బాసటగా నిలిచిన అనేక ప్రజా సంఘాలనుంచి ఈ విజ్ఞప్తి వచ్చింది. ప్రజా సంఘాల సూచనలను గౌరవిస్తూ “చలో నంద్యాల” కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్ణయించింది.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా పరిరక్షణకు చేపట్టదలచిన “చలో నంద్యాల” కార్యక్రమ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.