నాగార్జున-దియా మీర్జా నటించిన ‘వైల్డ్ డాగ్’ ఈ రోజు విడుదలైంది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. పెద్దగా కథ లేకపోయినా కథనంతో నైనా ఆకట్టుకునే తీరులో పెద్దగా లేదని, కేవలం యాక్షన్ సీన్లని ఆధారంగా చేసుకుని నిర్మించారని ఒకవైపు అసంతృప్తి వుండగా, మరో వైపు టెక్నాలజీ పరంగా అద్భుత యాక్షన్ థ్రిల్లర్ అని అంటున్నారు. 2007 లో హైదాబాద్ లో జరిగిన బాంబుదాడుల కుట్రదారుడ్ని నేపాల్ లో పట్టుకునే కథతో నాగార్జున ఎన్ ఐ ఏ అధికారిగా నటించాడు. నాగార్జున గెటప్, లుక్, ఫిట్ నెస్ ఈ సినిమాలో భిన్నంగా వున్నాయి. సినిమాలో ఆయన అవసరమైన రెగ్యులర్ మసాలాలు పెట్టుకోకుండా సీరియస్ పాత్ర పోషించాడు. అయితే టైటిల్ గా పెట్టుకున్నంత వైల్డ్ డాగ్ గా ఏమీ లేడని అంటున్నారు. సస్పెన్స్, టెన్షన్, డ్రామా వంటివి లోపించడంతో పాత్రకి బావోద్వేగాలు కొరవడి, పాత్రతో బాటు కఠా కథనాలూ ఫ్లాట్ గా మారాయని అంటున్నారు. టెక్నికల్గా మాత్రం దర్శకుడు సాల్మన్ మంచి ప్రతిభ కనబర్చాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా బావుంది. ట్విట్టర్ లో మాత్రం ప్రేక్షకులు తమకు నచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ్యాటినీ ఎంటర్టయిన్మెంట్ బ్యానర్ పై దీన్ని ఎస్. నిరంజన్
రెడ్డి కె. అన్వేష్ రెడ్డి నిర్మించారు.