ఆలియా భట్ కూడా కోవిడే…

బాలీవుడ్ లో తాజాగా ఆలియా భట్ కోవిడ్ బారిన పడింది. ఈ విషయం ఈ రోజు ఇంస్టా గ్రామ్ లో ఫ్యాన్స్ కి తెలియజేసింది. ఆ తర్వాత హోమ్ క్వారంటైన్ కి వెళ్లిపోయింది. ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కోవిడ్ నుంచి ఇలా కోలుకున్నాడో లేదో, ఆలియా కోవిడ్ బారిన పడింది.

ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయి కటియావాడి’ లో ప్రస్తుతం నటిస్తూండగా, సంజయ్ లీలా భన్సాలీ కూడా ఇటీవల కోవిడ్ బారిన పడ్డాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ లో రామ్ చరణ్ భార్య సీతా పాత్రలో ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో ఆమె తన షెడ్యూల్‌ ని పూర్తి చేసింది. ఈ నెలలో తిరిగి సెట్స్ లో జాయినవ్వాలి. కానీ ఆమెకు కోవిడ్ కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ తాజా షెడ్యూలు కొన్ని వారాలు వారాల ఆలస్యం కావచ్చంటున్నారు.

కాగా ఆలియా చేతిలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘గంగూబాయి కటియావాడి’ లతో బాటు, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్ – అమితాబ్ బచ్చన్ లతో కలిసి ‘బ్రహ్మాస్త్రా’, రనవీర్ సింగ్ తో ఓ రోమాంటిక్ చిత్రమూ వున్నాయి.

ఇలా వుండగా, ముంబాయిలో కోవిడ్ రోజురోజుకూ విజృంభిస్తూ మరణాలు కూడా సంభవిస్తూంటే, థియేటర్లు మూసి వేయించిన ప్రభుత్వం షూటింగ్స్ ని నిషేధించ లేదు. దీంతో షూటింగుల్లో పాల్గొంటున్నవారు ప్రతీరోజూ కోవిడ్ పేషంట్లుగా మారుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *