దేశరాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని నిరవధికంగా మూసేశారు. ఏ తరగతికి కూడా విద్యార్థులతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలవడేదాకా 2021-2022 విద్యాసంవత్సరానికి తరగతులు తీసుకోరాదని ప్రభుత్వం తెలిపింది.
అయితే, 9 నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు మిడ్ టర్క్, ప్రీబోర్డు, వార్షిక పరీక్షలకు అవసరమయిన గౌడెన్స్ కోసం అపుడపుడు పాఠశాలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిలవవచ్చని చెప్పింది. వారికి తరగతులు తీసుకోవాడానికి వీల్లేదు.
విద్యార్థులందరికి డిజిటిల్ తరగతులను కొనసాగించవచ్చని విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
కరోన వ్యాప్తి అరికట్టేందుకు ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలను 2020 మార్చిలోనే మూసేశారు. అయితే,10, 12 తరగతులకు జనవరి 18న, 9 , 11 తరగతులకు ఫిబ్రవరి 5ర పాఠశాలలను తెరిచారు. గురువారం నాడు ఢిల్లో 2,790 కొత్త కరోనా కేసులు కనిపించాయి.