రజనీ కాంత్ కి దాదా సాహేబ్ పాల్కే… తమిళనాడులో కాలుమోపవచ్చా ఇక…

తమిళ నాడులో కాలుమోపేందుకు కాసింత జాగా కోసం భారతీయ జనతాపార్టీ పడరానిపాట్లు పడుతూ ఉన్న సంగతి తెలిసిందే.

ఆ పార్టీకి ఉత్తరాది పార్టీ, హిందీ పార్టీ అనే ముద్ర పడిపోయింది. అందుకే, కర్నాటక మినహా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలలో ఎక్కడ ఆపార్టీకి కాలుమోసే జాగా దొరకడం లేదు.

అన్ని సౌత్ రాష్ట్రాలు ఒక ఎత్తు, తమిళనాడు ఒక ఎత్తు. తమిళనాడులో పాగా వేస్తే, చుట్టూర ఉన్న రాష్ట్రాలను కభళించవచ్చని ఆ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటపుడు తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. అందుకే ఏదో విధంగా తమిళ భూభాగం మీద కాలుమోపేందుకుఅన్ని విధాల ప్రయత్నిస్తున్నది.

ఒకవైపు పుదుచ్చేరి నుంచి ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తున్నది. అక్కడ ఉన్న కాంగ్రెస్ నారాయణ స్వామి ప్రభుత్వాన్ని పిరాయింపులతో కూల్చేసింది. ఎన్నికలకు సిద్ధమయింది. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి అక్కడ ఎన్నివేషాలు చెల్లాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటుచేసినా దక్షిణాదిలో ప్రవేశించనట్లుగా ప్రచారం చేసుకోవచ్చు. అది కూడా తమిళ ప్రాంతమే కాబట్టి, ‘తమిళ’ భూమిలో కాలుమోపినంతంగా ఆనందపడవచ్చు. అదే విధంగా అక్కడి నుంచి తమిళనాడు మీద దాడుల జరపవచ్చు. ఇదీ ప్లాన్.

తమిళనాడుకు సంబంధించి చివరి అస్త్రం ప్రయోగించారు.

అది తమిళ సూపర్ స్టార్ కి దాదా సాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించడం. ఈ ఉదయం కేంద్రం మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఈ అవార్డు ను ప్రకటించారు.

ఇలా ఎన్నికల జరిగే టప్రడు ప్రకటిస్తే అపకీర్తి వస్తుందనే సంకోచం లేకుండా కేంద్రం నిర్ణయం ప్రకటించింది. తమిళనాడు లో రజనీకి ఉన్నా ఫాలోయింగ్ విపరీతం. ఈ ప్రకటతో వారిని సంతృప్తి పరచవచ్చనేది బిజెపి ఆశ. చూడాలి ఏమవుతుందో.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *