ఆశ్చర్యపర్చే ‘మాస్ట్రో’  ఫస్ట్ గ్లింప్స్!

 

ఈ రోజు రంగ్ దే హీరో  నితిన్ బర్త్ డే సందర్భంగా అతడి  నెక్స్ట్ మూవీ ‘మాస్ట్రో’ ఫస్ట్ గ్లింప్స్ అభిమానుల ముందుకొచ్చి సందడి చేస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ట్రో’ లో నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్ లు హీరోహీరోయిన్లుగా  నటిస్తున్న విషయం తెలిసిందే. రోమాంటిక్ కామెడీల నితిన్ కి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తో ఫ్యాన్స్ కి కొత్త పండగే. సోషల్ మీడియాలో వెర్రెత్తి పోతున్నారు ఈ ఫస్ట్ గ్లింప్స్ లో నితిన్ కొత్తావతారం చూసి!

ఈ ఫస్ట్ గ్లింప్స్ నితిన్ పియానో ప్లే చేస్తూండడంతో ప్రారంభమవుతుంది. సన్నివేశంలో వాతావరణం ఏదో తేడాగా, మిస్టీరియస్ గా వుంటుంది. ఈ ఫీల్ ని రెట్టింపు చేస్తూ పిల్లి ఒకటి భయానకంగా మూల్గుతూ వస్తుంది. సీన్ కట్, అయి బకెట్లో నీట ముంచిన నితిన్ ముఖం కనపడుతుంది. అప్పుడు నితిన్ కళ్ళు  పిల్లి కళ్లులా గగుర్పాటు కల్గిస్తాయి. నితిన్ అంధుడు! ఇది అంధుడి టెర్రిఫిక్ కథ. హిందీలో సూపర్ హిట్టయిన ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధా ధున్’ కిది రీమేక్. నితిన్ ఈ కొత్త అవతారంతో ఫస్ట్ గ్లింప్స్ మాస్టర్ స్ట్రోక్ లా వుంది.  నిన్న నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ‘మాస్ట్రో’ రేమేక్ తో అభిమానుల్ని నిరాశపర్చడనే అనుకుంటున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో ఎన్ సుధాకర్ రెడ్డి, ఎన్ నికితా రెడ్డి, రాజ్‌కుమార్ ఆకెళ్ళ  దీన్ని నిర్మిస్తున్నారు. విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు.  జూన్ 11, న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *