తెలంగాణలో మీ ఇష్టదైవం ప్రసాదంఇక నుంచి ‘హోం డెలివరీ’

 

భక్తులకు స్పీడ్ పోస్టు ద్వారా ప్రసాదం

 ప్ర‌సాదం, ఆల‌య పూజ‌ సేవ‌ల బుకింగ్ పోసాఫీసులో

పోస్టల్ డిపార్ట్ మెంటుతో ఒప్పందం కుదుర్చుకున్న దేవాదాయ శాఖ‌

 

హైద‌రాబాద్, మార్చి 27: తెలంగాణలోని  ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను (డ్రై పూట్స్ ) భక్తుల ఇళ్లకు నేరుగా  చేరవేసేందుకు ఏర్పాటు జరిగింది.  దీనికోసం  ఇందుకోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటారు.  త‌పాల శాఖ ద్వారా ఇంటికే దేవుళ్ళ ప్రసాదాలు, మొబైల్ యాప్ ద్వారా పూజ సేవ‌లను అందించే విధానాన్ని శ‌నివారం అర‌ణ్య భ‌వ‌న్ లో శ‌నివారం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు.

తెలంగాణ‌లోని 10 ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్‌లో రాష్ట్రంలో ఎక్కడికైనా పంపే విధంగా పోస్టల్ శాఖతో ఒప్పందం కుదిరింది.  ప్రసాదం ముఖ్యంగా  డ్రై పూట్స్  హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు నేరుగా ఏ పోస్టాఫీసుకైనా వెళ్లి బుక్ చేసుకోవ‌చ్చు.

యాదాద్రి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహాస్వామి దేవాస్థానం, భ‌ద్ర‌చ‌లం శ్రీ సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యం, వేముల‌వాడ -శ్రీరాజ‌రాజేశ్వ‌ర ‌స్వామి ఆల‌యం, బాస‌ర శ్రీ జ్ఞాన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి దేవాస్థానం, కొండ‌గ‌ట్టు అంజ‌నేయ స్వామి టెంపుల్, కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి ఆల‌యం, ఉజ్జ‌యిని మ‌హాంకాళీ ఆల‌యం, సికింద్రాబాద్ గ‌ణేష్ టెంపుల్, బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌- పోచమ్మ టెంపుల్‌, కర్మాన్ ఘాట్ హ‌నుమాన్ దేవాల‌యంలో ఈ సేవ‌లు ఈ పద్ధతిలో అందుబాటులోకి రానునున్నాయి.

భక్తులు తమకు నచ్చిన గుడిలో ప్ర‌సాదాల‌కు పోస్ట్ ఆఫీసులో రుసుం చెల్లిస్తే, వారి పేరిట ప్రసాదాలను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తార‌ని మంత్రి  పేర్కొన్నారు.

ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లో ప్రసాదాన్ని స్పీడ్ పోస్టులో భక్తుల ఇంటికి డోర్ డెలివరీ చేస్తార‌ని తెలిపారు.

దేశ వ్యాప్తంగా 1.60 ల‌క్ష‌ల పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌న్నారు.

ప్రసాదంతో  పాటు ఆల‌య పూజ‌ సేవ‌ల బుకింగ్ ల‌ను కూడా త‌పాల శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో పూజ‌ సేవ‌ల‌ను బుక్ చేసుకోలేని వారికోసం పోస్ట్ ఆఫీసులో ఆఫ్ లైన్ ద్వారా ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు.

దేవస్థానాల్లో జరుగు నిత్య ఆర్జిత సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశము లేని భక్తులు అన్ని సేవలు పరోక్షముగా వారి గోత్ర నామములతో జరిపించడానికి ఆన్ లైన్ సేవ‌ల‌ను విస్త‌రిస్తున్నామ‌నిమంత్రి తెలిపారు.

దేవాదాయ శాఖలోని మ‌రో 15 ఆల‌యాల్లో ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే 22 ప్రసిద్ధ ఆల‌య సేవ‌ల‌ను మొబైల్ యాప్ (T App Folio) ద్వారా ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చామని అన్నారు. అన్ని సేవలు పరోక్షముగా వారి గోత్ర నామములతో జరిపించడానికి ఈ మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని మంత్రి చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *