కరోనా ఎఫెక్ట్ : ఎపి రాజ్భవన్ లో హోళీ వెేడుకలు బంద్

విజయవాడ, మార్చి 27: ఆంధ్రప్రదేశ్  కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య పెరగుతున్నుందన  విజయవాడ ఎపి రాజ్ భవన్‌లో హోలీ వేడుకలు బంద్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  గవర్నర్ వారి కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఈ విషయం తెలిపారు.

రాష్ట్ర ప్రజలందరూ ఇంట్లో ఉండి హోలీ పండుగను జరుపుకోవాలని గవర్నర్  హరిచందన్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్యాలెండర ప్రకారం ఈ  నెల 29న హోళీవేడుకలుజరగాలి.

సామాజిక దూరాన్ని కొనసాగించడం, మూతికి ముసుగు ధరించడం, శానిటైజర్ లేదా సబ్బు ఉపయోగించి తరచుగా చేతులు కడుక్కోవడం వంటి వాటిని విస్మరించరాదని,  కరోనా వ్యాప్తి గురించి ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ రాష్ట్రప్రజలను కోరారు.

ఇదే కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమయిందని కూడా గవర్నర్ చెప్పారు. కోవిడ్ నుంచి భద్రత కోసం  అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టీకాలు వేయుంచు కావాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

ఇది వైరస్ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి సహాయ పడుతుందని గవర్నర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *