తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపి పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు.మొదట పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం వీఆర్సీ సెంటర్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. వీఆర్సీ సెంటర్ నుంచి వేలాది మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.